News September 11, 2025
కామారెడ్డి: జిల్లాలో 5 రోజుల పాటు భారీ వర్షాలు: కలెక్టర్

KMR జిల్లాలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సమాచారం అందించిందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఇప్పటికే జిల్లాలో అధిక వర్షాల వల్ల కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధికారులు క్షేత్రస్థాయిలో చురుగ్గా వ్యవహరించాలన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలు, ప్రాజెక్టులు, చెరువులను గుర్తించాలన్నారు. అత్యవసర పరిస్థితిల్లో టోల్ ఫ్రీ నంబర్ 08468-220069కు సంప్రదించాలన్నారు.
Similar News
News September 11, 2025
గోదావరిఖని: ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి: CPI

తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని రామగుండం నగర CPI కార్యదర్శి కే.కనకరాజు పేర్కొన్నారు. గోదావరిఖని పట్టణ చౌరస్తాలో గురువారం తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
News September 11, 2025
సింగరేణి కార్మికుల సమస్యలపై INTUC సమావేశం

HYDలోని INTUC కార్యాలయంలో సింగరేణి కార్మికుల సమస్యలపై యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్(RGM) ఆధ్వర్యంలో గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులపై యాజమాన్యం అవలంబిస్తోన్న మొండి వైఖరిని ఎదుర్కునే విధానాలపై చర్చించారు. కార్మికులకు లాభాల వాటా, కాంట్రాక్టు కార్మికుల బోనస్, IT మాఫీ అంశాలను సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
News September 11, 2025
VKB: లోక్ అదాలత్లో కేసులు రాజీ కుదిరేలా చూడాలి: ఎస్పీ

సెప్టెంబర్ 13న నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్‌లో భారీగా కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఎస్పీ నారాయణరెడ్డి పోలీస్ స్టేషన్ల అధికారులను సూచించారు. రాజీయే రాజమార్గమని కక్షిదారులకు అవగాహన కల్పించి కేసులు పరిష్కరించాలన్నారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకుంటే ఇరువర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.