News February 6, 2025
కామారెడ్డి: జిల్లా అధ్యక్షురాలి నియామకం

మహిళా కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా పాక జ్ఞానేశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆమెకు నియామకపత్రాన్ని అందజేశారు. రెండోసారి తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షురాలిగా నియమించిన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలంబ, రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News December 29, 2025
4G బుల్లెట్ సూపర్ నేపియర్ గడ్డి పెంపకం

చాలా మంది రైతులు సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని జీవాలకు ఇస్తున్నారు. ఇప్పుడు దీన్ని మించి అధిక ప్రొటీన్ శాతం కలిగి, పశువుల్లో పాల దిగుబడిని మరింత పెంచే ‘4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం’ అందుబాటులోకి వచ్చింది. నేపియర్‌తో పోలిస్తే చాలా మృదువుగా, 10-13 అడుగుల ఎత్తు పెరిగి, ఎకరాకు 200 టన్నుల దిగుబడినిస్తుంది. దీన్ని అన్ని రకాల నేలల్లో కొద్ది నీటి వసతితో పెంచవచ్చు. ఏడాదికి 6-7 సార్లు కోతకు వస్తుంది.
News December 29, 2025
WGL: ఆస్తుల వివరాలు వెల్లడించాల్సిందే!

ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సుమారు 30 మంది IAS, IPS, IFS అధికారులకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2024 ఏడాదికి సంబంధించిన స్థిరాస్తి వివరాలను (IPR) జనవరి 31లోపు సమర్పించాలని పేర్కొంది. నిర్ణీత 33 రోజుల గడువులోగా వివరాలు ఇవ్వని వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు తమ ఆస్తుల డేటాను గడువులోగా ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
News December 29, 2025
TU: ‘అపరాధ రుసుముతో సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించండి’

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా B.Ed, B.P.Ed మొదటి, మూడవ సెమిస్టర్ విద్యార్థులు అపరాధ రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు సోమవారమే ఆఖరు తేదీ అని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. రూ.100 అపరాధ రుసుముతో నేడు ఫీజు చెల్లించవచ్చన్నారు. సెమిస్టర్ పరీక్షలు జనవరిలో నిర్వహిస్తామని, విద్యార్థులు తమ కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు.


