News March 10, 2025

కామారెడ్డి: జిల్లా పంచాయతీ అధికారిగా మురళి

image

కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారిగా మురళి సోమవారం పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పని చేసిన శ్రీనివాసరావు నిజామాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మురళిని నియమించారు. ఈ మేరకు తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. మండల పంచాయతీ యూనియన్ ప్రతినిధులు ఆయనను శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Similar News

News January 5, 2026

యాషెస్ 5వ టెస్ట్.. 2వ రోజు పోరాడుతున్న ఆస్ట్రేలియా

image

యాషెస్ సిరీసులో సిడ్నీ వేదికగా జరుగుతున్న 5వ టెస్టులో 2వ రోజు ఆట ముగిసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో AUS 166/2 రన్స్ చేసి మరో 218 పరుగులు వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (91 నాటౌట్), జేక్ వెదరాల్డ్ (21) 74 బాల్స్‌లో 57 రన్స్ చేసి తొలి వికెట్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. మైఖెల్ నెసర్ (1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. 211/3 ఓవర్‌నైట్ స్కోరుతో 2వ రోజు ఆట మొదలుపెట్టిన ENG 384 రన్స్‌కు ఆలౌటైంది.

News January 5, 2026

తెనాలి సబ్ కలెక్టర్ గ్రీవెన్స్‌కు 7 ఫిర్యాదులు

image

తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 7 ఫిర్యాదులు వచ్చాయి. సబ్ కలెక్టర్ సంజనా సింహ వేరే అధికారిక కార్యక్రమానికి వెళ్లడంతో కార్యాలయ అధికారులే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ 1, మున్సిపాలిటీ 2, దేవాదాయ శాఖ 1, పంచాయతీ రాజ్ విభాగానికి 3 అర్జీలు చొప్పున మొత్తం 7 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటిని ఆయా విభాగాలకు పంపి పరిష్కరిస్తామని తెలియజేశారు.

News January 5, 2026

WGL: ‘వాహనాలు రాంగ్ రూట్‌లో నడిపితే ప్రమాదమే’

image

వరంగల్ నగరంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంచే దిశగా వరంగల్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. Safety First, Life First నినాదంతో రాంగ్ రూటులో వాహనాలు నడపొద్దు అంటూ వరంగల్ పోలీసులు తమ అఫీషియల్ ఎక్స్ (X) ఖాతాలో ప్రత్యేక పోస్టును షేర్ చేశారు. తప్పు దిశలో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతుందని, ఇది కేవలం వాహనదారులకే కాకుండా ఇతర ప్రయాణికుల ప్రాణాలకు కూడా ప్రమాదంగా మారుతుందని పోలీసులు స్పష్టం చేశారు.