News February 11, 2026

కామారెడ్డి జిల్లా 1 గం. పోలింగ్ అప్‌డేట్

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 4 మున్సిపాలిటీల్లో మధ్యాహ్నం 1 గం వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లాలో 99,313 ఓటర్లు ఉండగా కామారెడ్డి 43,486 మంది (43.79%), బాన్సువాడ 12,217 (50.51%), బిచ్కుంద 7,743 (60.69%), ఎల్లారెడ్డి 7,020 మంది (52.92%) ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం పోలింగ్ వేగం పుంజుకొని ఉత్సాహంగా కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా 47.13% పోలింగ్ నమోదైంది.

Similar News

News February 20, 2026

నల్గొండ: మున్సిపాలిటీల్లో ‘కోఆప్షన్’ కోలాహలం

image

జిల్లాలోని మున్సిపాలిటీల్లో నూతన పాలక వర్గాల ఏర్పాటు ప్రక్రియ ముగియడంతో, రాజకీయ సమీకరణాలు ఇప్పుడు కోఆప్షన్ సభ్యుల భర్తీ చుట్టూ తిరుగుతున్నాయి. పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఈ పదవులను దక్కించుకోవడానికి ద్వితీయ శ్రేణి నాయకులు, ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారు, పార్టీ కోసం కష్టపడిన వారు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు.

News February 20, 2026

నల్గొండ: ప్రభుత్వ బడి విద్యార్థులకు ‘రవాణా’ భరోసా

image

మారుమూల ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దూర ప్రాంతాల నుంచి ప్రయాణించే విద్యార్థుల కోసం ఉద్దేశించిన రవాణా భత్యం నిధులను రాష్ట్ర సమగ్ర శిక్షా విభాగం తాజాగా విడుదల చేసింది. జిల్లాలో అర్హులైన ప్రతి విద్యార్థికి నెలకు రూ.600 చొప్పున ప్రభుత్వం కేటాయించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ నుంచి మార్చి వరకు నిధులను విడుదల చేసింది

News February 20, 2026

నాడు నాగన-కందనవోలు.. నేడు నాగర్‌కర్నూల్

image

నాగర్‌కర్నూల్ పేరు వెనుక ఒక విశిష్టమైన చరిత్ర దాగి ఉంది. పూర్వ కాలంలో నాగన, కందన అనే సోదరులు ఈ ప్రాంతాన్ని ఏలేవారని, వారి పేరు మీదుగా దీనికి నాగన-కందనవోలు అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. కాలక్రమంలో వ్యవహారికంలో ఆ పేరు కాస్తా నాగర్‌కర్నూల్‌గా రూపాంతరం చెందింది. చుట్టుపక్కల నల్లమల అడవులు, ప్రాజెక్టులతో అలరారే ఈ ప్రాంతం, స్వరాష్ట్రంలో జిల్లాగా అవతరించింది.