News October 12, 2025

కామారెడ్డి డీసీసీ: ఛైర్ కోసం ఢీ అంటే ఢీ!

image

కామారెడ్డి జిల్లా DCC అధ్యక్ష పదవి ఎన్నికపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ నెల 13వ తేదీన AICC, PCC పరిశీలకుల బృందం జిల్లాకు రానుంది. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కైలాస్ శ్రీనివాస్ మరో ఉన్నత పదవిని ఆశిస్తున్నారు. ముఖ్యంగా నిజాంసాగర్ మండల వాసి మల్లికార్జున్, బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, గీ రేడ్డి మహేందర్ రెడ్డి, రాజు ఈ పదవిని దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Similar News

News October 12, 2025

NLG: ఆడపిల్లలపై ఇంకా వివక్షే!..

image

నల్గొండ జిల్లాలో బాలికల సంఖ్య తగ్గుముఖం పట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం, గడిచిన నాలుగేళ్లలో జనన రేటు పరిశీలిస్తే ఏటా తగ్గుతూ వస్తోంది. ప్రతి 1,000 మంది బాలురకు ఏ ఒక్క మండలంలో కూడా బాలికల సంఖ్య 895కు మించకపోవడం ఆందోళనకరం. ఆడపిల్ల అంటేనే కొందరు తల్లిదండ్రులు నిరాసక్తత చూపడం ఈ వివక్షకు నిదర్శనం. దీనిపై అధికారులు దృష్టి సారించాలి. దీనిపై మీ కామెంట్.

News October 12, 2025

నీటి హక్కుల విషయంలో రాజీలేదు: ఉత్తమ్

image

TG: బనకచర్ల ప్రాజెక్ట్ DPR పరిశీలిస్తున్నామని కేంద్రం లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదన్న మాజీమంత్రి <<17976308>>హరీశ్<<>> రావు విమర్శలను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఖండించారు. ‘హరీశ్‌రావు అబద్ధాలు చెప్పి ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. నీటి హక్కుల విషయంలో రాజీపడేది లేదు. KCR హయాంలోనే రాష్ట్రానికి అన్యాయం జరిగింది. తుమ్మిడిహట్టికి DPR రూపొందించి బ్యారేజ్ నిర్మిస్తాం’ అని తెలిపారు.

News October 12, 2025

వృద్ధురాలి దోపిడీ ఘటనలో మనవడే సూత్రధారి: ఏసీపీ

image

అగనంపూడిలో వృద్ధురాలిని కత్తితో బెదిరించి దోపిడీ చేసిన ఘటనలో మనవడే సూత్రధారి అని ఏసీపీ నర్సింహమూర్తి పోలీసులు తెలిపారు. సురేశ్ తన స్నేహితుడు సుమంత్‌తో కలిసి అన్నెమ్మను బెదిరించి 5తులాల బంగారు గాజులు దోచుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో సుమంత్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా సురేశ్ సహకారంతోనే దోపిడీకి పాల్పడినట్లు చెప్పాడు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ వివరించారు.