News February 5, 2025
కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 1109 మంది అరెస్టు
కామారెడ్డి జిల్లాలో మద్యం సేవించి జనవరి నెలలో 1109 మంది వాహనదారులు పట్టుబడినట్లు ఎస్పీ సింధుశర్మ తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన జరిమానాలు విధిస్తామన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూదని తల్లిదండ్రులకు ఎస్పీ సింధుశర్మ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News February 5, 2025
పార్కుల్లో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి: బల్దియా కమిషనర్
పార్కుల్లో పెండింగ్ ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో హార్టికల్చర్, ఇంజినీరింగ్ అధికారులతో కమిషనర్ సమీక్షించారు. కమిషనర్ మాట్లాడుతూ.. నగర వ్యాప్తంగా ఉన్న వివిధ పార్కులలో దెబ్బతిన్న జిమ్ పరికరాలు, దెబ్బతిన్న లైటింగ్ ఏర్పాటు, నీటి సరఫరా పునరుద్ధరణ, నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టాలని ఆదేశించారు.
News February 5, 2025
ఢిల్లీలో కాంగ్రెస్‌కు శూన్య హస్తమేనా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మెజారిటీ సంస్థలు BJPకి, మరికొన్ని ఆప్‌కు అధికారం దక్కుతుందని తెలిపాయి. కాగా, దాదాపు అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్ ఖాతా తెరవదని చెప్పాయి. 0-3 సీట్లకే ఛాన్స్ ఉందని ఒకట్రెండు తెలిపాయి. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ పని ఖతమైనట్లే అని, ఆప్‌తో పొత్తు పెట్టుకోవాల్సిందని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు.
News February 5, 2025
మోకిల: స్కూల్ బస్సును ఢీకొని IBS విద్యార్థి మృతి
స్కూల్ బస్సును బైక్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మోకిల PS పరిధిలో జరిగింది. CI వీరబాబు వివరాలు ప్రకారం.. శంకర్‌పల్లి మండల IBS కాలేజీలో Btech చదివే విద్యార్థులు బొడ్డు శ్రీహర్ష (19), హర్ష నందన్ వేదాంతం (19) ఇద్దరు బైక్‌పై కొండకల్ నుంచి మోకిలకు వస్తుండగా ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు ఢీకొని శ్రీహర్ష అక్కడికక్కడే చనిపోయాడు. హర్ష నందన్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.