News November 4, 2025
కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారా..!

కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మొత్తం 14 మందికి న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. కామారెడ్డి PS పరిధిలో ఓ వ్యక్తికి ఒక రోజు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. మరో 9 మందికి రూ.9 వేలు జరిమానాలు వేశారు. దేవునిపల్లి పరిధిలో ముగ్గురికి రూ.3 వేల చొప్పున జరిమానా, బీబీపేట్ పరిధిలోని ఓ వ్యక్తికి రూ.వెయ్యి జరిమానాలు విధించింది.
Similar News
News November 4, 2025
ప్లాస్టిక్ డబ్బాలు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

ప్రస్తుతం అందరి ఇళ్లల్లో ఆహారపదార్థాలను పెట్టడానికి ప్లాస్టిక్ డబ్బాలు వాడుతున్నారు. అయితే వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ప్లాస్టిక్ కంటైనర్లపై ప్లాస్టిక్ కంటైనర్ల food-grade/ BPA-free అని ఉంటేనే వాడాలి. వాటిలో వేడి పదార్థాలు వేయకూడదు. పగుళ్లు, గీతలున్న ప్లాస్టిక్ వస్తువులు వాడకపోవడమే మంచిది. PETE రకం ప్లాస్టిక్ డబ్బాలను ఒకట్రెండు సార్లు మాత్రమే వాడాలని చెబుతున్నారు.
News November 4, 2025
చిత్తూరు: ఆలస్యంగా వస్తున్న టీచర్లు..!

చిత్తూరు జిల్లాలో సుమారు 100 మంది ప్రభుత్వ టీచర్లు స్కూళ్లకు ఆలస్యంగా వస్తున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు సైతం గుర్తించారు. టీచర్లు ఆలస్యంగా రావడంపై వివరణ కోరామని DEO వరలక్ష్మి చెప్పారు. ఆలస్యానికి గల కారణాలు చెప్పాలని ఆదేశించారు. టీచర్లు సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఆలస్యంగా రావడం, త్వరగా వెళ్లిపోవడం చేయకూడదని స్పష్టం చేశారు.
News November 4, 2025
వరంగల్: 123 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

మద్యం తాగి వాహనాలు నడపటం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 123 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 74, సెంట్రల్ జోన్ పరిధిలో 23, వెస్ట్ జోన్ పరిధిలో 18 ఈస్ట్ జోన్ పరిధిలో 8 కేసులు నమోదయ్యాయి


