News September 6, 2025
కామారెడ్డి: డ్రోన్ కెమెరాల నిఘాలో వినాయక శోభయాత్ర

కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను శుక్రవారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర ప్రారంభించారు. ఈ యాత్రను భద్రత దృష్ట్యా డ్రోన్ కెమెరాల నిఘాలో పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ధర్మశాల వద్ద మొదటి వినాయక రథానికి కొబ్బరికాయ కొట్టి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా ఉత్సవాలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
Similar News
News September 6, 2025
ఉపరాష్ట్రపతి ఆఫీస్ రాజకీయ సంస్థ కాదు: సుదర్శన్‌రెడ్డి

ఇండీ కూటమి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న బి.సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉపరాష్ట్రపతి ఆఫీస్ రాజకీయ సంస్థ కాదు. ఆ స్థానంలో కూర్చునే వారికి జడ్జి లక్షణాలు అవసరం. నిష్పక్షపాతం, వివేకం, మాటలు, చేతల్లో న్యాయం ఉండాలి. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల సంఘానిదే. అర్హుల ఓటు హక్కు తొలగించొద్దు’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.
News September 6, 2025
BHPL: సన్నకారు రైతుకు యూనిట్‌కు రూ.50 వేల రాయితీ

భూపాలపల్లి జిల్లాలో కూరగాయలు సాగు చేసే సన్న, చిన్నకారు రైతులకు ప్రభుత్వం యూనిట్‌కు రూ.50 వేల రాయితీ ఇస్తున్నట్లు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సునీల్ తెలిపారు. టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట గ్రామంలో పందిరి విధానంలో సాగు చేస్తున్న బోడకాకరను పరిశీలించారు. పందిరి సాగు విధానాలను ప్రోత్సహిస్తూ ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీ, సాంకేతిక సహాయం అందుబాటులో ఉంటుందని వివరించారు.
News September 6, 2025
రైతుల పరిస్థితి అగమ్యగోచరం: బొత్స

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గరివిడి వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో శుక్రవారం సమావేశం అయ్యారు. విత్తనం నుంచి ఎరువుల వరకు రైతులు పడరాని పాట్లు పడాల్సి వస్తోందన్నారు. యూరియా కొరత పై ఈనెల 9న రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టి ఆర్డీవోలకు వినతిపత్రాలు అందిస్తామన్నారు.