News January 25, 2026

కామారెడ్డి: ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు జిల్లా వాసి

image

నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామానికి చెందిన కమ్మరి రాజు దేశ రాజధాని ఢిల్లీలో 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. భారత ప్రభుత్వం నుంచి ఆయనకు పిలుపు రావడంతో శనివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి రాష్ట్రం నుంచి ఐదుగురు ఎంపికయ్యారు. అందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కమ్మరి రాజు ఒక్కరు ఉండటం విశేషం.

Similar News

News January 30, 2026

మేడారంలో మంచిర్యాల జిల్లా మహిళ మృతి

image

మేడారం వనదేవతల చెంత ఘోర ప్రమాదం జరిగింది. జంపన్న వాగు సమీపంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో వాహనం అదుపు తప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మంచిర్యాల జిల్లా ఇందారానికి చెందిన సుగుణ(60) పైనుంచి ట్రాక్టర్ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్లముందే జరిగిన ఈ ప్రమాదంతో జాతరలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

News January 30, 2026

మార్చినాటికి విజయవాడ బైపాస్ పూర్తి: గడ్కరీ

image

AP: గొల్లపూడి నుంచి చినకాకాని(17.88KM) వరకు చేపట్టిన VJA బైపాస్ MARనాటికి పూర్తవుతుందని కేంద్రమంత్రి గడ్కరీ పేర్కొన్నారు. లోక్‌సభలో MP బాలశౌరి అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు. ‘ఈ ప్రాజెక్టులో 4KM మేర మాత్రమే పనులు పెండింగ్ ఉన్నాయి. వాటిని మార్చి31 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని తెలిపారు. 2019లో ఈ 6వరసల బైపాస్ నిర్మాణానికి రూ.1,194cr అంచనావ్యయంతో అనుమతులిచ్చారు.

News January 30, 2026

KMR: దొంగ బంగారం అమ్మబోతే దొరికిపోయాడు.. ఖేల్ ఖతం!

image

దొంగ సొత్తు కొనుగోలు చేసిన వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. SP రాజేష్‌చంద్ర వివరాలిలా.. గతేడాది పిట్లం, బీర్కూరు పరిధిలో భాస్కర్ బాపూరావు చవాన్ చోరీలకు పాల్పడ్డాడు. ఆ దొంగ సొత్తును మహారాష్ట్ర వాసి ఇర్ఫాన్ నూర్ పాషా పఠాన్‌కు అమ్మినట్లు వెల్లడైంది. ఇతను HYDలో ఆభరణాలు అమ్మేందుకు రాగా, పట్టుకొని 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి నగలను స్వాధీనం చేసుకున్నట్లు SP వివరించారు.