News September 20, 2025

కామారెడ్డి: ‘దసరా సెలవుల్లో మార్పు చేయాలి’

image

రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు దసరా సెలవులను మార్పు చేయాలని రాష్ట్ర జూనియర్ లెక్చలర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్యకు వినతిపత్రం పంపించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 5 వరకు దసరా సెలవులు జూనియర్ కళాశాలలకు ప్రకటించాలని కోరారు. ముందుగా ప్రకటించిన 28వ తేదీని వెంటనే మార్పు చేయాలన్నారు.

Similar News

News September 20, 2025

కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్

image

కొత్తగూడెంలోని సింగరేణి సంస్థ ప్రధాన ఆసుపత్రిలో శుక్రవారం అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. 65 ఏళ్ల ఓ మహిళ శరీరం నుంచి 8kgల కాంప్లెక్స్ ఒవేరియన్ ట్యూమర్ తొలగించారు. సింగరేణి ఆసుపత్రి ప్రత్యేక వైద్య బృందం కంబైన్డ్ స్పెషల్ ఎపిడ్యూరల్ అనస్తీషియా కింద నిర్వహించారు. వైద్య సిబ్బందిని చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్ అభినందించారు.

News September 20, 2025

సంగారెడ్డి: 21 నుంచి దసరా సెలవులు: డీఈవో

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 21 నుంచి OCT 3 వరకు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించిందని డీఈఓ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. దసరా సెలవుల్లో ఎవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News September 20, 2025

బీచ్ ఫెస్టివల్ ప్రమోట్ చేసేలా ఫ్లాష్ మాబ్

image

AP: SEP 26, 27, 28 తేదీల్లో బాపట్ల(D) సూర్యలంక బీచ్‌లో నిర్వహించే బీచ్ ఫెస్టివల్‌కు వినూత్న ప్రచారం కల్పించేందుకు టూరిజం శాఖ సిద్ధమైంది. రాష్ట్రంలోని వర్సిటీల భాగస్వామ్యంతో సూర్యలంక, VJA, TPT, RJY, GNT, HYDలో ఫ్లాష్ మాబ్ నిర్వహించనున్నారు. వీటిలో పాల్గొన్న విద్యార్థులను SEP 27న వరల్డ్ టూరిజం డే రోజు CM చంద్రబాబు సత్కరిస్తారు. బీచ్ ఫెస్టివల్‌లో వాటర్ స్పోర్ట్స్, సీ పుడ్ ఆకర్షణగా నిలువనున్నాయి.