News March 26, 2025

కామారెడ్డి: ‘ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి’

image

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వరి ధాన్యం అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రబీ సీజన్‌లో ధాన్యం సేకరణకు సరిపడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

Similar News

News February 26, 2026

డోలిమోతల నడుమ ప్రసవించడం బాధాకరం: రాయపాటి శైలజ

image

అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని మల్లిపాడు గ్రామానికి చెందిన సుమిత్ర డోలిమోతల నడుమ టార్చి లైట్ వెలుగుల్లో ప్రసవించడం బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. గిరిజన గర్భిణీలను ప్రసవానికి 15 రోజుల ముందే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చి వైద్యుల పర్యవేక్షణలో సుఖ ప్రసవా జరిగే కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు.

News February 26, 2026

శ్రీకాకుళం: పాత పైప్‌లైన్ల తొలగింపు

image

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడానికి నీటి కాలుష్యమే ప్రధాన కారణమని భావిస్తున్న అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ట్యాంకర్ల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు. డ్రైనేజీల పక్కన ఉన్న పాత పైప్‌లైన్లను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. సేకరించిన 412 వాటర్ శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం విశాఖపట్నం ల్యాబ్‌లకు పంపగా, ప్రాథమిక రిపోర్టుల ప్రకారం నీరు సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం.

News February 26, 2026

కోర్టు కేసులతో విసిగిపోయారా? ఇదే మంచి ఛాన్స్!

image

ఉమ్మడి తూ.గో జిల్లా వ్యాప్తంగా మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జాతీయ న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత గురువారం తెలిపారు. రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ వంటి కేసులను ఈ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ ద్వారా త్వరితగతిన ముగించుకోవాలని ఆమె సూచించారు.