News October 30, 2025

కామారెడ్డి: నవంబర్ 4న యువజన వారోత్సవాలు

image

జిల్లాలోని కళాభారతి వేదికగా నవంబర్ 4న యువజన వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కళాకారుల బృంద సభ్యులు గురువారం తెలిపారు. పాటలు, వ్యాసరచన, డాన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీలో పాల్గొనదలిచిన యువత వయస్సు 15 నుంచి 29 ఏళ్ల వయస్సు, ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 2వ తేదీ లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News October 30, 2025

GNT: ‘పత్తి రైతులు పొలంలో నీరు తొలగించుకోవాలి’

image

తుఫాను వలన ముంపుకు గురైన పంటలకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అయితా నాగేశ్వర రావు ఒక ప్రకటనలో సూచించారు. పత్తి రైతులు వీలైనంత త్వరగా నీరు తొలగించి అంతర కృషి చేసి, నేల ఆరేటట్లు చేయాలన్నారు. అధిక తేమ వలన మొక్కలు భూమి నుండి పోషకాలను గ్రహించే స్థితిలో వుండవని చెప్పారు. అటువంటి పరిస్థితులలో మొక్కలు ఎర్రబడటం, వడలటం, ఎండిపోవడం జరుగుతుందన్నారు.

News October 30, 2025

తడిసిన ధాన్యాన్ని వెంటనే నివేదిక ఇవ్వాలి: కలెక్టర్

image

జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఉంటే వెంటనే నివేదిక సమర్పించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో ఆయన సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. ధాన్యం తడిస్తే వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

News October 30, 2025

సూర్యాపేట: విద్యాసంస్థల బంద్ విజయవంతం

image

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో బంద్ విజయవంతమైంది. స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు. వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరారు.