News December 10, 2025
కామారెడ్డి: నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: SP

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. రాజంపేట మండలంలోని చిన్న మల్లారెడ్డి, రాజంపేటలో పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అధికారులతో మాట్లాడి భద్రతా ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ప్రజలు భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ASP చైతన్య రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
Similar News
News December 12, 2025
ఈనెల 15 నుంచి జీజీ కళాశాల డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల రీఅడ్మిషన్

జీజీ కళాశాల డిగ్రీ 2, 4, 6, సెమిస్టర్ల రీ అడ్మిషన్లకు జనవరి 12వ తేదీ వరకు అవకాశం ఉందని ప్రిన్సిపల్ డా.రామ్మోహన్ రెడ్డి, కంట్రోలర్ భరత్ రాజ్, వైస్ ప్రిన్సిపల్ డా.రంగరత్నం తెలిపారు. డిగ్రీ రెండో సెమిస్టర్ తరగతులు డిసెంబర్ 15 నుంచి ప్రారంభం అవుతాయననారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు కావాలని సూచించారు.
News December 12, 2025
మహబూబాబాద్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

జిల్లాలో 155 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రం లోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 86.99 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.
News December 12, 2025
KMM: తొలివిడతలో సత్తా చాటిన కాంగ్రెస్ అభ్యర్థులు

ఖమ్మం జిల్లాలో జరిగిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (7 మండలాల్లో) కాంగ్రెస్ పార్టీ-136, బీఆర్ఎస్-34, సీపీఐ-6, సీపీఎం-10, టీడీపీ-2, ఇండిపెండెంట్-4 స్థానాల్లో విజయం సాధించారు. అధికంగా వైరా మండలంలో మొత్తం 22 గ్రామ పంచాయితీల్లో 20 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఎం-1, బీఆర్ఎస్- 1 స్థానాల్లో నిలిచారు.


