News October 10, 2025
కామారెడ్డి నుంచి భద్రాచలానికి ఆర్టీసీ బస్సు

కామారెడ్డి ఆర్టీసీ డిపో ద్వారా రేపటి నుంచి భద్రాచలం వరకు డీలక్స్ బస్సును ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News October 10, 2025
నిర్మల్: పత్తి కొనుగోలు పకడ్బందీగా నిర్వహించాలి

పత్తి పంట కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్‌లో పత్తి పంట కొనుగోలు ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పత్తి పంట కొనుగోలు ప్రక్రియను నిర్ణిత సమయానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు.
News October 10, 2025
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి: అదనపు కలెక్టర్

జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో త్వరగా కొనుగోళ్లు ప్రారంభించాలని అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి కొనుగోలు కమిటీ ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారులు జారీ చేసిన టోకెన్లు కలిగిన రైతుల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
News October 10, 2025
సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్

TG: రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. వెల్ఫేర్ సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ విడుదల చేశారు. ఒక్కో ఎస్సీ, బీసీ సొసైటీకి రూ.20కోట్లు.. ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు రూ.10కోట్ల నిధులు రిలీజ్ చేశారు. సొసైటీ సెక్రటరీకి ఫండ్ వినియోగించే అధికారం కల్పించారు. సొసైటీల స్థాయిలోనే హాస్టళ్లలో సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.