News November 9, 2025
కామారెడ్డి: నేటి నుంచి కాలభైరవ స్వామి ఉత్సవాలు

రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలోని కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ప్రభు తెలిపారు. తొలి రోజు బద్ది పోచమ్మకు బోనాలు, సోమవారం లక్ష దీపార్చన, మంగళవారం డోలారోహణం, జన్మదినోత్సవం, బుధవారం రథోత్సవం, రక్షా యజ్ఞం, అగ్నిగుండాలు ఇతర పూజా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. భక్తులకు అన్ని వసతులు కల్పించినట్లు ఈవో పేర్కొన్నారు.
Similar News
News November 9, 2025
రేపు సాలూరు ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటీస్ మేళా

సాలూరు ప్రభుత్వ ఐటీఐ వద్ద సోమవారం అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస ఆచారి తెలిపారు. బొబ్బిలి, విజయనగరం, విశాఖలోని ప్రముఖ కంపెనీల్లో 100 వేకెన్సీలు ఉన్నాయన్నారు. అప్రెంటీస్ అయిన వారు ప్లేస్మెంట్ కోసం కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు అన్నారు. స్టైఫండ్ రూ.12 వేలు నుంచి రూ.15 వేలు వరకు ఇస్తారని, అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలు తీసుకొని ఉదయం 10 గంటలకు హాజరుకాలన్నారు.
News November 9, 2025
APPLY NOW: NPCILలో 122 పోస్టులు

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL)లో 122 Dy మేనేజర్, Jr ట్రాన్స్‌లేటర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, PG, MBA, ఇంజినీరింగ్ డిగ్రీ, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు NOV 27 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. వెబ్‌సైట్: https://npcilcareers.co.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 9, 2025
MBNR: తుప్పు పట్టిన 104 అంబులెన్స్‌లు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో దాదాపు ఆరు 104 అంబులెన్స్‌లు నిలుచున్న తోనే తుప్పు పట్టి తూట్లు పడుతున్నాయి. వాటికి మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకువస్తే కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉండదని ప్రజలు అంటున్నారు. డీఎంహెచ్వో కృష్ణయ్యను Way2News వివరణ అడగగా.. ఆ వాహనాలు వేలం కోసం ఉన్నాయని, వేలంలో అమ్ముతామని తెలిపారు.


