News March 7, 2025
కామారెడ్డి: నేరాల అదుపునకు పోలీసుల కృషి అభినందనీయం: ఎస్పీ

కామారెడ్డి జిల్లాలో నేరాల అదుపునకు పోలీస్ సిబ్బంది తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఎస్పీ సింధుశర్మ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని దొంగతనాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి ఉన్నారు.
Similar News
News February 26, 2026
వరంగల్: 14వాహనాలు.. 35 టన్నుల ఇసుక సీజ్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాదారులపై పోలీసులు నిఘా ఉంచారు. 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న 14 వాహనాలు అధికారులు పట్టుకున్నారు. సుమారు 35 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకొని, 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.
News February 26, 2026
గద్వాల్: ప్రియదర్శిని కళాశాలలో 27న ఉద్యోగమేళా

గద్వాలలోని ప్రియదర్శిని గవర్నమెంట్ మహిళా డిగ్రీ కాలేజీలో ఫిబ్రవరి 27న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ మీనాక్షి సీపీడీసీ సాయి శ్యామ్ రెడ్డి తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన వారు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు అర్హులు. Just Dial, MedPlus, Muthoot Finance తదితర ప్రముఖ సంస్థలు పాల్గొంటాయి. ఎంపికైన వారికి అదే రోజు అపాయింట్మెంట్ లెటర్లు అందజేయనున్నారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News February 26, 2026
చర్లపల్లి: ఖైదీలకు నూనె తయారీపై శిక్షణ

చర్లపల్లి ఖైదీల వ్యవసాయ కాలనీ(పీఏసీ)లోని ఆయుర్వేద గ్రామంలో కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్‌ను జైళ్ల శాఖ డీజీ డా.సౌమ్య మిశ్రా ప్రారంభించారు. 6 సంవత్సరాల విరామం అనంతరం ఆయుర్వేద గ్రామాన్ని పునః ప్రారంభించారు. ఖైదీల సంక్షేమం, పునరావాసానికి ఈ శిక్షణ కేంద్రం దోహదపడుతుందని ఆమె స్పష్టంచేశారు. కార్యక్రమంలో DIGలు శ్రీనివాస్, సంపత్, సూపర్డెంట్లు భరత్ ప్రమోద్, ఆయుర్వేద వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.


