News December 31, 2025
కామారెడ్డి: న్యూ ఇయర్.. చికెన్, ఫిష్ మార్కెట్లలో సందడి

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. 2026కు స్వాగతం పలికేందుకు జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. దీంతో బుధవారం కామారెడ్డి జిల్లాలోని చికెన్, ఫిష్ మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. డిమాండ్‌కు అనుగుణంగా చేపల ధరలు సాధారణం కంటే అధికంగా పలికాయి. అయినప్పటికీ పండుగ జోష్‌లో ప్రజలు కొనుగోలుకు వెనుకాడలేదు. మీ ప్రాంతంలో కొత్త ఏడాది వేడుకల సందడి ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News January 1, 2026
CBNపై KCR విమర్శలు.. TDP నేతల ఫైర్!

AP CM చంద్రబాబుపై BRS చీఫ్ KCR ఇటీవల చేసిన <<18634035>>వ్యాఖ్యలపై<<>> AP TDP నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. CBN స్టేట్స్‌మెన్ అని ప్రపంచమంతా కీర్తిస్తోందని, KCRకి నచ్చితే ఎంత? నచ్చకుంటే ఎంత? అంటూ మంత్రి ఆనం ఫైరయ్యారు. తమ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం బాధించిందన్నారు. అధికారం పోయినప్పుడల్లా CBNపై పడి ఏడవటం BRSకు అలవాటుగా మారిందని, కేసీఆర్ TDPలోనే పెరిగారని నిన్న MLA బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.
News January 1, 2026
జగిత్యాల: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం ప్రారంభం

జగిత్యాల కలెక్టరేట్లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం-2026 కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ గోడపత్రిక ఆవిష్కరించి ప్రారంభించారు. రోడ్డు భద్రతపై అవగాహనతో పాటు ట్రాఫిక్ నియమాల పాటన ఎంతో కీలకమని కలెక్టర్ అన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.
News January 1, 2026
పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో ‘స్టార్ పెర్ఫార్మర్’ అవార్డులు

కలెక్టర్ సూచనల మేరకు PDPL ప్రభుత్వ ఆసుపత్రిలో జనవరి నెలకు ‘స్టార్ పెర్ఫార్మర్’ అవార్డులు ప్రదానం చేశారు. SNCU స్టాఫ్ నర్స్ శ్రీమతి ప్రశాంతి, క్యాజువాలిటీ స్టాఫ్ నర్స్ శ్రీమతి కళ్యాణిలను ఎంపిక చేశారు. SNCUలో మెరుగైన సేవలు, శిక్షణ అందించినందుకు ప్రశాంతిని, తోడులేని రోగులకు అంకిత సేవలందించినందుకు కళ్యాణిని సత్కరించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా.శ్రీధర్, డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


