News March 12, 2025

కామారెడ్డి: పదోతరగతి విద్యార్థి సూసైడ్

image

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పి భరించలేక గర్గుల్‌కు చెందిన పదోవతరగతి విద్యార్థి శరత్ కుమార్ (16) ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా శరత్‌కు క్రికెట్ అంటే ప్రాణమని పైగా విరాట్ కోహ్లికి వీరాభిమాని అని స్థానికులు తెలిపారు. జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీల్లో అనేక అవార్డులను శరత్ సొంతం చేసుకున్నాడు. శరత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 12, 2025

NZB: ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

image

నిజామాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారుల బృందం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి తనిఖీలు చేపడుతోంది. ప్రధాన గేటుకు తాళం వేసి సోదాలు చేస్తున్నారు. పలువురు ఏజెంట్లు లోపల ఉండగా ఈ దాడి జరిగింది. కాగా ఈ కార్యాలయం పరిధిలో పలువురు అధికారులు ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలోనే ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు జరుపుతున్నట్లు తెలిసింది.

News March 12, 2025

NZB: గ్రూప్-2లో BC(A) విభాగంలో SIకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

image

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఏడవ బెటాలియన్ రిజర్వ్‌డ్ ఎస్సై BC(A) లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం, లింగాపూర్ గ్రామానికి చెందిన వరంగంటి అశోక్ నాలుగేళ్లుగా డిచ్పల్లి ఏడవ బెటాలియన్‌లో SIగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో బీసీఏలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు.

News March 12, 2025

ఆర్మూర్: గ్రూప్స్ ఫలితాలలో సత్తా చాటిన పెర్కిట్ వాసి

image

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతానికి చెందిన రామ్ కిషోర్ గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో గ్రూప్-2 ఫలితాలలో 136వ ర్యాంక్ సాధించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.

error: Content is protected !!