News January 20, 2026
కామారెడ్డి: పదో తరగతి విద్యార్థినులకు ఇస్రో సందర్శన భాగ్యం

కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రోత్సాహంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థినులకు ISROను సందర్శించే అవకాశం లభించింది. గత అక్టోబర్ నెలలో నిర్వహించిన ప్రతిభా పరీక్ష ద్వారా ఎంపికైన 50 మంది విద్యార్థినులు, వారితో పాటు 30 మంది ఉపాధ్యాయులు ఈనెల 29 ఇస్రో సందర్శనకు వెళ్లనున్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను కలెక్టరేట్ కార్యాలయం సోమవారం విడుదల చేసింది.
Similar News
News February 21, 2026
T20 WC: భారత్‌కు షాక్!

సూపర్-8లో రేపు సౌతాఫ్రికాతో మ్యాచుకు ముందు టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. నిన్న నెట్స్‌లో పేస్ బౌలర్ సిరాజ్ గాయపడినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. హార్దిక్ బ్యాటింగ్ చేస్తూ కొట్టిన బంతి సిరాజ్ మోకాలికి తగలడంతో నొప్పితో మైదానాన్ని వీడినట్లు తెలిపాయి. సిరాజ్ గాయం తీవ్రతపై టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అటు ప్రిపరేషన్ ఫుల్ స్వింగ్‌లో ఉందంటూ ప్లేయర్ల ఫొటోలను BCCI షేర్ చేసింది.
News February 21, 2026
చాపింగ్ బోర్డును ఇలా క్లీన్ చేయండి

కూరగాయలు కట్ చేయడం కోసం చాపింగ్ బోర్డు వాడతారు. కానీ దాని క్లీనింగ్‌పై అంత దృష్టి పెట్టరు. దీనికోసం కొన్ని టిప్స్..* చాపింగ్బోర్డుపై కొద్దిగా నీళ్లు, బేకింగ్ సోడా వేసి నిమ్మచెక్కతో రుద్ది వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే సరిపోతుంది. * ఉప్పు, నిమ్మచెక్కతో చాపింగ్ బోర్డును రుద్ది, 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగెయ్యాలి. * దీన్ని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్లను వాడకూడదు.
News February 21, 2026
జగిత్యాల: ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ, రేపే చివరి తేదీ

జగిత్యాలలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే 5 నెలల ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 22తో ముగియనుందని స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.నరేష్ తెలిపారు. బ్యాంకింగ్, RRB, SSC తదితర పోటీ పరీక్షలకు ఉచిత వసతి, స్టడీ మెటీరియల్, నోట్‌బుక్స్, పాకెట్ మనీతో శిక్షణ అందించనున్నారు. అభ్యర్థులు http://tsstudycircle.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు 6303554770లో సంప్రదించవచ్చు.


