News July 14, 2024

కామారెడ్డి: పెద్ద ఎక్లార ప్రభుత్వ పాఠశాలలో చోరీ.!

image

మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో దొంగతనం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి రాములు తెలిపారు. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి పాఠశాల తాళాలు పగలు గొట్టి రెండు కంప్యూటర్లు దొంగిలించినట్లు వివరించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఏఎస్సై వచ్చి పరిశీలించారని పేర్కొన్నారు. కాగా పోలీసుల వివరణ ప్రకారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు రాలేదని తెలిపారు.

Similar News

News October 7, 2024

కామారెడ్డి: మూడు ఉద్యోగాలు వద్దని లేఖ

image

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అరుణ మూడు ఉద్యోగాలను వదులుకున్నారు. 2018లో TGT, PGT ఉద్యోగాలు రాగా, 2019లో JLగా ఎంపికై విధుల్లో చేరారు. అనంతరం DL ఉద్యోగం రావడంతో JL ఉద్యోగం వదులుకున్నారు. తాజాగా DSCలో ర్యాంకు సాధించారు. అరుణ తాను సాధించిన 5 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలకు నాట్ విల్లింగ్ లేఖను డీఈఓకు అందజేసింది. లెటర్ ఇవ్వడం వల్ల ఉద్యోగాలు ఇతరులకు వచ్చే అవకాశం ఉంది అని అన్నారు.

News October 7, 2024

మోస్రా: చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

image

చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మోస్రా మండలానికి చెందిన సాయిలు(46) అప్పులు తీసుకున్నాడు. కాగా, అవి ఎలా తీర్చాలో అర్థం అవ్వక మానసింకంగా కుంగిపోయేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెంది చెరువులో దూకి సూసైడ్ చేసుకునట్లు తెలిపారు.తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

News October 7, 2024

NZB: ‘పరిమితులకు లోబడి DJ యాజమాన్యం వ్యవహారించాలి’

image

పోలీస్ శాఖ పరిమితులకు లోబడి DJ యాజమాన్యం వ్యవహారించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చి నిజామాబాద్‌లో ఇబ్బంది పెడుతున్నట్టు DJ వాళ్లపై చట్ట పరంగా చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలకు, సీనియర్ సిటిజన్స్‌కు ఇబ్బందులు కలగకుండా చట్ట పరిధిలో రెండు సౌండ్ బాక్స్ సిస్టమ్‌లు వాడలన్నారు.