News August 15, 2025
కామారెడ్డి: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కల్లూరి మహేష్‌కు కామారెడ్డి జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.70 వేల జరిమానా విధించింది. బాన్సువాడలో 2021లో జరిగిన ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ఈ కేసుపై విచారణ జరిపిన జిల్లా జడ్జి వర ప్రసాద్, సాక్ష్యాలు, వైద్య నివేదికల ఆధారంగా నిందితుడు మహేష్‌ను దోషిగా నిర్ధారించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
Similar News
News August 15, 2025
EP36: శత్రువులను ఎలా గెలవాలంటే: చాణక్య నీతి

ప్రతి వ్యక్తికి మిత్రులే కాదు.. శత్రువులు కూడా ఉంటారు. అలాంటి విరోధిని ఎలా గెలవాలో చాణక్య నీతి వివరిస్తోంది. ‘మీ శత్రువు ముందు మీరు ఆనందంగా ఉండండి. మీ విజయాలను వారికి తెలిసేలా చేయండి. మీ సంతోషం, మీ ఎదుగుదలే ఆ శత్రువులను అథఃపాతాళానికి తొక్కేస్తుంది. ఇంతకన్నా మీరు వారిపై మరే ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు’ అని చెబుతోంది.
<<-se>>#Chankyaneeti<<>>
News August 15, 2025
తిరుపతి IITలో ఉద్యోగాలకు దరఖాస్తులు

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఇతర వివరాలకు www.iittp.ac.in/Outsourced_Positions వెబ్‌సైట్ చూడాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 25.
News August 15, 2025
WOW.. మువ్వన్నెల రంగుల్లో మెరిసిన SRSP

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టు మూడు రంగుల్లో మెరిసిపోతోంది. ప్రాజెక్టును అధికారులు త్రివర్ణ పతాకం రంగుల్లో అలరారేలా చేయగా ప్రజలు దానిని చూసేందుకు బారులు తీరారు. చూసేందుకు కన్నుల పండువగా ఉండగా నిత్యం ఇలా లైటింగ్‌తో ఉంచితే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.