News May 9, 2024
కామారెడ్డి: పోల్‌మేనేజ్‌మెంటుకు రంగం సిద్ధం
లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతోంది. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. దీంతో 3 ప్రధాన పార్టీలు ముఖ్యనేతలను రప్పించి రోడ్‌షోలు, సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, CM రేవంత్ రెడ్డిల బహిరంగ సభను ఈనెల 11న కామారెడ్డిలో ఏర్పాటు చేశారు. పోల్‌మేనేజ్‌మెంట్‌ను పక్కాగా చేపట్టేందుకు అభ్యర్థులు, నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
Similar News
News January 19, 2025
NZB: దాశరథి శతజయంతిని ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ సాయుధ పోరాటానికి జవసత్వాలు నింపిన ప్రజాకవి, పీడనపై అగ్నిధారను కురిపించిన కలం యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే హైదరాబాద్‌లో ప్రధాన కూడలిలో దాశరథి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర సాంస్కృతిక, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కవిత లేఖ రాశారు.
News January 19, 2025
NZB: భర్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్య
పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు మూడో టౌన్ ఎస్ఐ హరిబాబు శనివారం తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. నిజామాబాద్ హమాల్వాడికి చెందిన నాగం సాయికుమార్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. శనివారం ఉదయం భార్యతో గొడవ పడడంతో భార్య పుట్టింటికి వెళ్ళింది. భార్య లేదని మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News January 19, 2025
NZB: నేడు నగరానికి రానున్న ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం నగరానికి రానున్నారు. ఇటీవల ప్రారంభించిన పసుపు బోర్డు అంశంపై ఆమె మీడియా సమావేశంలో ప్రసంగించనున్నారు. ఎల్లమ్మ గుట్టలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగల గణేశ్ గుప్తా, జడ్పీ మాజీ ఛైర్మన్ విట్టల్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.