News November 17, 2025
కామారెడ్డి ప్రజావాణికి 87 దరఖాస్తులు

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 87 దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ రవితేజ ఫిర్యాదులను స్వీకరించారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News November 17, 2025
హైదరాబాద్ బస్తీలకు కదిలే అంగన్వాడీలు!

కదిలే గ్రంథాలయం, మూవింగ్ ఫుడ్ కోర్ట్ విన్నాం కానీ.. కదిలే అంగన్ వాడీ కేంద్రం విన్నారా..? లేదు కదా..! త్వరలో చూస్తారు కూడా. నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో మూవింగ్ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 37 అధునాతన వాహనాలను కూడా సిద్ధం చేసిందని సమాచారం. అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సలహాలు ఇస్తారు.

ఇతిహాసాలు క్విజ్ – 69 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: శివుడికి ‘నీలకంఠుడు’ అని ఎందుకు అంటారు?
సమాధానం: పాల సముద్రాన్ని మథించేటప్పుడు భయంకరమైన విషం వెలువడింది. దాన్ని హాలాహలం అని అంటారు. సమస్త లోకాల సంరక్షణ కోసం శివుడు ఆ విషాన్ని తన కంఠంలో (గొంతులో) ఉంచుకుంటాడు. అందువల్ల ఆయన గొంతు నీలం రంగులోకి మారింది. అలా శివుడు నీలకంఠుడు అయ్యాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>