News October 13, 2025

కామారెడ్డి: ప్రజావాణికి 90 ఫిర్యాదులు

image

కామారెడ్డిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 90 ఫిర్యాదులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ చందర్ నాయక్ తెలిపారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్లు చెప్పారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పార్థసింహారెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ పాల్గొన్నారు.

Similar News

News October 13, 2025

వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ

image

14 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రీడా ప్రపంచాన్ని మెప్పించిన వైభవ్ సూర్యవంశీకి బిహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రమోషన్ ఇచ్చింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ తొలి 2 రౌండ్లకు వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఆ జట్టు కెప్టెన్‌గా సకీబుల్ గని వ్యవహరించనున్నారు. ఎల్లుండి నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. కాగా IPLలో RR తరఫున అదరగొట్టిన వైభవ్.. ఇటీవల IND-U19 జట్టు తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించారు.

News October 13, 2025

బాపట్ల పోలీస్ కార్యాలయానికి 66 అర్జీలు

image

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ ఉమామహేశ్వర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 66 అర్జీలు అందినట్లు తెలిపారు. ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని పేర్కొన్నారు.

News October 13, 2025

బాల్య వివాహాలు చట్టరీత్య నేరం: కలెక్టర్

image

బాల్య వివాహాలు సమాజానికి శాపమని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. దీనిపై పోరాడటానికి ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేసి, బాల్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. 18 ఏళ్ల లోపు బాలికకు, 21 ఏళ్ల లోపు బాలుడికి వివాహం చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు. బాల్య వివాహాల సమాచారం అందించడానికి లేదా సహాయం కోసం వెంటనే టోల్-ఫ్రీ నంబర్లు 112, 1098, 100 లకు కాల్ చేయాలని సూచించారు.