News October 27, 2025
కామారెడ్డి: ప్రజావాణిలో 106 దరఖాస్తులు

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో వివిధ మండలాల దరఖాస్తుదారుల నుండి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అర్జీలను స్వీకరించారు. అనంతరం, వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా శాఖలకు మొత్తం 106 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News October 27, 2025
VKB: ‘ఉద్యానవన పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలి’

ఉద్యానవన పంటల సాగుకు రైతులను ప్రోత్సహించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటున అందించాలని అదనపు కలెక్టర్ సుధీర్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ఉద్యానవన పంటలు ఆయిల్ పామ్ పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఉద్యానవన పంటల సాగులో లక్ష్యాలను అధిగమించేలా రైతులను ప్రోత్సహించి రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
News October 27, 2025
ములుగు: ఫ్లాష్ ఫడ్స్ వస్తాయి.. అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

వచ్చే రెండు రోజులు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు, అకస్మాత్తు వరదల ముప్పు ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ దివాకర అన్నారు. జిల్లాకు భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు, ప్రజలకు సూచనలు చేశారు. కలెక్టరేట్లో అధికారులతో అత్యవసర సమీక్ష జరిపారు. లోతట్టు ప్రాంతాలలో ముందుస్తుగా రేషన్, ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. సాయం కోసం 18004257109ను సంప్రదించాలన్నారు.
News October 27, 2025
నిబంధనల మేరకే వైన్ షాప్ నిర్వహించాలి: MHBD కలెక్టర్

MHBD జిల్లాలో నిర్వహించిన 2025-27 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించిన వైన్ షాపులను నిబంధనల మేరకే నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. జిల్లాలోని 61 వైన్ షాపుల లక్కీ డ్రా నిర్వహణ కార్యక్రమం సందర్భంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 1 నుంచి నూతన మద్యం దుకాణాలు కొనసాగనున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దుకాణాలు నిర్వహించాలని ఆదేశించారు.


