News December 22, 2025
కామారెడ్డి: ప్రజావాణిలో 60 దరఖాస్తులు

కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో మొత్తం 60 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతున్నదని తెలిపారు. తక్షణమే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News December 23, 2025
మంచిర్యాల జిల్లాలో నిన్నటి ప్రధానాంశాలు

• జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో కొలువు తీరిన పాలకవర్గాలు
• జైపూర్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి
• మందమర్రి టోల్ గేట్ వద్ద కార్మికుల ఆందోళన
• లోక్ అదాలత్లో 4411 కేసులు పరిష్కారం
• క్రిస్మస్ సందర్భంగా రూ.25 వేల అడ్వాన్స్
• హాస్పటల్ భవనాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
• కన్నాలలో బోర్ మోటార్ ఎత్తుకెళ్లిన దొంగలు
News December 23, 2025
WGL: ‘సార్’ అనని ఆ జిల్లా అధికారి ఎవరు?

ఉమ్మడి జిల్లాలో ఓ ప్రజాప్రతినిధిని సార్ అని సంబోధించలేదని ఓ జిల్లా అధికారిపై గుస్సా అయినట్టు తెలిసింది. తన రాజకీయ అనుభవమంత వయస్సు లేని ఆ అధికారి, తనను ప్రజాప్రతినిధి గారు అని పిలవడంతో చిర్రెత్తిన నేత వెంటనే ఆ అధికారిని జిల్లా నుంచి బదిలీ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. అందరి ముందు తనను సార్ అనకుండా, సాదాసీదాగా ప్రజాప్రతినిధి గారు అని పిలవడాన్ని పెద్దాయన జీర్ణించుకోలేకపోయారని తెలిసింది.
News December 23, 2025
సింహాచలం: ఆన్‌లైన్‌లో వైకుంఠ ఏకాదశి టికెట్లు

సింహాచలంలో డిసెంబర్ 30న జరగనున్న ముక్కోటి ఏకాదశి దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఈవో సుజాత సోమవారం తెలిపారు. 100,300,500 రూపాయలు టికెట్స్ డిసెంబర్ 26 నుంచి 29 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. దర్శనానికి టికెట్లు ఆన్‌లైన్‌లో మాత్రమే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. www.aptemples.org, 9552300009 మన మిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. భక్తులు గమనించాలని సూచించారు.


