News December 21, 2025
కామారెడ్డి: ఫుడ్ సేఫ్టీపై రెజిస్ట్రేషన్, లైసెన్స్ మేళా

కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఈ నెల 22న ఆహార భద్రత రిజిస్ట్రేషన్, లైసెన్స్ మేళా నిర్వహించనున్నట్లు డెసిగ్నేటెడ్ అధికారి శిరీష తెలిపారు. ప్రతి ఆహార వ్యాపారి తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, లేనిపక్షంలో తగిన పత్రాలతో ఈ మేళాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.5 లక్షల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని ఆమె హెచ్చరించారు.
Similar News
News January 1, 2026
VZM: బిల్ స్టాప్ (డమ్మీ) మీటర్లతో బురిడీ

విజయనగరం జిల్లా విద్యుత్ శాఖలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ‘బిల్ స్టాప్’ (డమ్మీ) మీటర్ల పేరుతో ఓ ఉద్యోగి ఒక్కో మీటరును రూ.10,00-రూ.15,000 విక్రయిస్తూ సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నాడు. ఈ మీటర్లు అమర్చుకుంటే కరెంట్ వాడకం ఎంత ఉన్నా బిల్లు ‘0’ వస్తుంది. అధికారుల అండదండలతోనే ఈ అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఈఈ త్రినాథరావు బుధవారం తెలిపారు.
News January 1, 2026
మహిళలూ కొత్త సంవత్సరంలో ఇవి ముఖ్యం

తల్లి, భార్య, కూతురు, కోడలు పాత్రల్లో జీవిస్తున్న మహిళ తన గురించి తాను మర్చిపోయింది. ఈ కొత్త సంవత్సరంలోనైనా నీ కోసం నువ్వు బ్రతుకు. నీ నిర్ణయాలు నువ్వు తీసుకో, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టు. కష్టపడి నిర్మించుకున్న కెరీర్, చెమట చిందించి సంపాదించిన ప్రతి రూపాయినీ కాపాడుకో.. ఇంటర్నెట్ వాడకంలో జాగ్రత్తగా ఉండు.. ఆరోగ్యాన్ని సంరక్షించుకో.. కొత్తసంవత్సరాన్ని అద్భుతంగా మార్చుకో..
News January 1, 2026
మండపేటలో ‘ఫ్లెక్సీ’ వార్.. YCP బ్యానర్లు తొలగించడంపై భగ్గుమన్న శ్రేణులు!

మండపేట పట్టణంలో నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు ఆదేశాల మేరకు ఉదయం హడావిడిగా తొలగించడం వివాదాస్పదమైంది. ఈ చర్యను వ్యతిరేకిస్తూ వైసీపీకి చెందిన బీసీ నాయకులు నిరసన తెలిపారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నాయకులు మున్సిపల్ కార్యాలయంలో లిఖితపూర్వక అనుమతి తీసుకున్నట్లు తెలియడంతో కమిషనర్ తిరిగి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.


