News December 19, 2025

కామారెడ్డి: బడా నేతల స్వగ్రామాల్లో చుక్కెదురు

image

కామారెడ్డి జిల్లాలో GP ఎన్నికల్లో ప్రజలు వినూత్న తీర్పునిచ్చారు. మాజీ MLA గంప గోవర్ధన్ స్వగ్రామం బస్వాపూర్‌లో తుడుం పద్మ(కాంగ్రెస్), మాజీ MLA ఏనుగు రవీందర్ రెడ్డి స్వగ్రామం ఎర్రపహాడ్‌లో సొంఠికీ మల్లవ్వ(BJP), కామారెడ్డి ఎమ్మెల్యే కేవీ రమణా రెడ్డి స్వగ్రామం దేమికలాన్‌లో కటకం భార్గవి(BRS) గెలిచారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇలాకాలో పోతుగంటి సంతోష్ రెడ్డి(స్వతంత్ర అభ్యర్థి) విజయం సాధించారు.

Similar News

News December 20, 2025

KTR, హరీశ్ రావులకు KCR కీలక బాధ్యతలు

image

TG: పంచాయతీ ఎన్నికల ఫలితాలను BRS చీఫ్ KCR విశ్లేషించారు. ఫలితాలు పార్టీకి సానుకూలంగా ఉన్నాయన్న అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. రానున్న MPTC, ZPTC, MNP ఎన్నికల్లోనూ మరింత దూకుడుతో వెళ్లాలని పార్టీ సీనియర్లకు సూచించారు. దీనికోసం మున్సిపల్ ఎన్నికల బాధ్యతను పట్టణ ఓటర్లలో ఇమేజ్ ఉన్న KTRకు అప్పగించారు. అలాగే సీనియర్ నేత హరీశ్ రావు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సన్నద్ధతను పర్యవేక్షించనున్నారు.

News December 20, 2025

వివిధ పంటల్లో తెగుళ్లు – నివారణకు సూచనలు

image

☛ అన్ని కూరగాయ పంటల్లో అక్షింతల పురుగు, చిత్తపురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 2మి.లీ కలిపి పిచికారీ చేయాలి. వంగ, కాకర, ఆగాకర పంటలకు మాత్రం లీటరు నీటికి థయోడికార్బ్ 1 గ్రాము కలిపి పిచికారీ చేసుకోవాలి.
☛ మిరప, టమాటా, క్యాబేజీ వంటి పంటల్లో ఎండుతెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా మెటాలాక్సిల్ + మాంకోజెబ్ 2గ్రా. కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి.

News December 20, 2025

పొగమంచు అడ్డంకి.. మోదీ చాపర్ యూటర్న్

image

PM మోదీ పర్యటనకు పొగమంచు అడ్డంకిగా మారింది. కోల్‌కతా విమానాశ్రయం నుంచి పశ్చిమ బెంగాల్ నాడియా జిల్లాలోని తాహెర్‌పుర్ హెలిప్యాడ్‌కు బయల్దేరిన మోదీ హెలికాప్టర్ దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండ్ కాలేకపోయింది. కొద్దిసేపు చక్కర్లు కొట్టిన తర్వాత చాపర్ తిరిగి కోల్‌కతాకు వెళ్లిపోయింది. NH ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన PM, వాతావరణం అనుకూలించక వర్చువల్‌గానే మాట్లాడారు.