News October 30, 2024

కామారెడ్డి: బదిలీపై వెళ్లిన రెండు రోజులకే విషాదం

image

బదిలీ అయ్యి పాఠశాలలో విద్యార్థులకు పరిచయం కాకముందే ఉపాధ్యాయుడిని విధి కాటేసింది. ఈఘటన నాగిరెడ్డిపేట మండలం మాసానిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన వరిగే నర్సింలు కుమారుడు యాదగిరికి రెండు ఉద్యోగాలు రాగా, లింగంపేట్ బాలుర ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా విధుల్లో చేరాడు. రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు.

Similar News

News October 31, 2024

జల్లాపల్లి: పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్

image

నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని జల్లాపల్లి ఫారం గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. పేకాట కేంద్రంలో ఐదుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.7,350 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో పేకాట ఆడితే సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.

News October 30, 2024

ఎల్లారెడ్డి: ‘డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి’

image

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి నాలుగువేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్‌రావు కోరారు. ఆయన ఈ విషయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి అధికారికంగా లేఖ రాశారు. రాష్ట్రంలో అత్యధిక వెనుకబడిన నియోజకవర్గం ఎల్లారెడ్డి అని ఆయన తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.

News October 30, 2024

కామారెడ్డి: ‘నవంబర్ 9, 10వ తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు’

image

నవంబర్ 9, 10 వ తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ తెలిపారు. జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లోని బిఎల్ఓ లకు ఆఫ్ లైన్ ద్వారా అర్హత గల యువతీ యువకులు దరఖాస్తులు చేసుకోవచ్చును.