News April 9, 2024
కామారెడ్డి: బస్సు ఢీకొని MBA విద్యార్థి మృతి
సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం ఇస్నాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డికి చెందిన ఆకుల అరుణ్ (23) మృతి చెందాడు. అరుణ్ గీతం యూనివర్సిటీలో ఎంబీఏ చదుతున్నాడు. కాగా నిన్న సాయంత్రం స్నేహితుడి వద్ద ఉన్న ల్యాప్‌టాప్ తీసుకుని వెళ్తుండగా ఓ పరిశ్రమకు చెందిన బస్సు అతని బైకును ఢీకొట్టింది. దీంతో అరుణ్ అక్కడిక్కడే మృతి చెందాడు. పఠాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 1, 2025
రుద్రూర్: బట్టలు ఉతకడానికి వెళ్లి యువకుడి దుర్మరణం
రుద్రూర్ మండలం అక్బర్ నగర్ చెరువులో శుక్రవారం రాత్రి JNC కాలనీకి చెందిన సాజన్(36) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. గురువారం సాయంత్రం బట్టలు ఉతకాడానికి బైక్ పై వెళ్లిన సాజన్ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా చెరువులో మృతదేహం లభించింది. ఎస్ఐ సాయన్న ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు
News February 1, 2025
మెండోరా: బ్యాంక్ చోరీకి ప్రయత్నించిన వ్యక్తి అరెస్ట్
మెండోరాలో 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న SBI బ్యాంకులో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో నెహ్రునగర్ గ్రామానికి చెందిన శ్యామ్ అనే వ్యక్తి బ్యాంక్ షటర్ తాళాలు పగలగొట్టి షటర్ తీసే ప్రయత్నం చేశాడు. షటర్ తెరుచుకోకపోవడంతో వెనుదిరిగాడు ఉదయం బ్యాంకు మేనేజర్ వచ్చి సీసీ కెమెరాలు చూడటంతో దొంగతనానికి పాల్పడినట్లు గమనించి మెండోరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శ్యామ్‌ను అరెస్టు చేశారు.
News February 1, 2025
NZB: ఆదిత్య హృదయ స్తోత్ర పఠనంలో రికార్డు
ఆదిత్య హృదయ స్తోత్రం చదవడంలో నిజామాబాద్‌కు చెందిన సహాన్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు సాధించినట్లు తెలుగు వెలుగు సమాఖ్య కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. 31 శ్లోకాలు గల ఆదిత్య హృదయ స్తోత్రమును 2వ తరగతి చదువుతున్న సహాన్ కేవలం 3 నిమిషాలు 24 సెకన్లలో స్వర యుక్తంగా చదివి జాతీయ స్థాయి రికార్డు సాధించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 3న రైల్వే స్టేషన్ రోడ్డు గీత భవనంలో ఆశీర్వద సభ ఉంటుందన్నారు.