News March 9, 2025

కామారెడ్డి: బాధితురాలి వద్దకే జడ్జి

image

కామారెడ్డిలోని జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో భాగంగా అదనపు జూనియర్ న్యాయమూర్తి దీక్ష బట్టు ఒక కేసులో బాధితురాలు వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలు స్వప్న నడవలేని స్థితిలో ఉండటంతో ఆమె వద్దకు వెళ్లారు. కేసు విషయంలో రాజీ కుదిర్చరు. వెంట న్యాయవాదులు జడల రజనీకాంత్, వేణు ప్రసాద్ ఉన్నారు.

Similar News

News November 4, 2025

చల్లని vs వేడి నీళ్లు.. పొద్దున్నే ఏవి తాగాలి?

image

ఉదయాన్నే ఓ గ్లాసు నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘గోరువెచ్చటి నీటికి జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. డిటాక్సిఫికేషన్, రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఓ గ్లాసు చల్లటి నీళ్లు తాగితే క్యాలరీలు బర్న్ అవుతాయి. రిఫ్రెషింగ్ ఫీలింగ్ కలుగుతుంది. చల్లటి నీటికి శరీరం వేగంగా హైడ్రేట్ అవుతుంది’ అని చెబుతున్నారు. మీ అవసరాలను బట్టి గోరువెచ్చటి లేదా చల్లటి నీరు తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

News November 4, 2025

వయ్యారిభామను కట్టడి చేసే కలుపు మందులు

image

వయ్యారిభామ నిర్మూలనకు పంట మొలకెత్తక ముందు అట్రాజిన్ రసాయన మందును లీటర్ నీటికి నాలుగు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. పంట మొలకెత్తిన 15 నుంచి 20 రోజులకు.. లీటరు నీటికి 2 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. బంజరు భూముల్లో లీటరు నీటికి 5 గ్రాముల అట్రాజిన్ మందు కలిపి పిచికారీ చేసి వయ్యారిభామను నివారించవచ్చు. కలుపు నివారణ మందులను పిచికారీ చేసేటప్పుడు పక్క పంటలపై పడకుండా జాగ్రత్తపడాలి.

News November 4, 2025

ఇతిహాసాలు క్విజ్ – 56

image

1. కౌరవ, పాండవుల గురువైన ద్రోణాచార్యుడి గురువు ఎవరు?
2. మేఘనాదుడు ఎవరిని పూజించడం వల్ల ఇంద్రజిత్ అయ్యాడు?
3. నవ విధ భక్తి మార్గాలలో మొదటిది ఏమిటి?
4. ప్రతి మాసంలో వచ్చే పన్నెండో తిథి పేరు ఏమిటి?
5. సీత స్వయంవరం లో ఉన్న శివధనుస్సు అసలు పేరు ఏమిటి?
– సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#Ithihasaluquiz<<>>