News February 27, 2026
కామారెడ్డి: బాధితుల వద్దకే పోలీసులు: ఎస్పీ

బాధితుడి ముంగిటకే వెళ్లి న్యాయం అందించే ‘సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్’ విధానాన్ని కామారెడ్డి జిల్లా పోలీసులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. జిల్లాలో రెండు రోజుల్లో ఈ విధానం ద్వారా ఐదు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు బాధితుల వద్దకు వెళ్లి ఫిర్యాదును స్వీకరించి FIRలను అందజేశారు. ఈ సేవలు పోలీసుల పట్ల ప్రజల్లో ఉన్న సామాజిక దృక్పథాన్ని మారుస్తున్నాయని ఎస్పీ రాజేశ్ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News March 1, 2026
మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్.. వార్ జోన్‌లో 80లక్షల మంది భారతీయులు!

US, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్‌లోని భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది. ప్రస్తుతం వార్ జోన్‌లో ఉన్న దేశాల్లో దాదాపు 80లక్షల మంది భారతీయులు ఉన్నారు. యూఏఈలో 35.5లక్షలు, సౌదీ అరేబియాలో 24.6లక్షలు, ఖతార్‌లో 8.4లక్షలు, కువైట్‌లో 9.9 లక్షలు, జోర్డన్‌లో దాదాపు 17వేలు, ఇజ్రాయెల్‌లో 20వేలు, ఇరాన్‌లో 10వేల మంది భారతీయులు ఉన్నారు. కాగా భారత విదేశాంగ శాఖ అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
News March 1, 2026
ఈరోజు నమాజ్ వేళలు (01-3-2026) ఆదివారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.46 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.51 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.44 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.57 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 1, 2026
నాగిరెడ్డిపేటలో సినిమా షూటింగ్

నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గువ్వల చెరువు ఘాట్ అనే సినిమా షూటింగ్ నిర్వహించారు. సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని షూటింగ్‌ను తిలకించారు. సినిమా నిర్వాహక మేనేజర్ శ్యామ్ మాట్లాడుతూ.. వచ్చే నెల 8 వరకు ఇక్కడ షూటింగ్ ఉంటుందన్నారు.


