News October 5, 2025
కామారెడ్డి: భారీ వర్షాలు.. కలెక్టర్ ఆకస్మిక పర్యటన

కామారెడ్డిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను అప్రమత్తం చేశారు. గతంలో ముంపునకు గురైన జీఆర్ కాలనీలో ఆదివారం మున్సిపల్ కమిషనర్, ఇతర రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కలిసి ఆయన పర్యటించారు. జీఆర్ కాలనీ బ్రిడ్జి వద్ద నీటి ఉద్ధృతిని ఆయన పరిశీలించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News October 5, 2025
జొన్నవాడ బ్రిడ్జి వద్ద ఇద్దరు యువకులు గల్లంతు

జొన్నవాడ బ్రిడ్జి వద్ద ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ పెన్నా నదిలో దిగిన యువకులు పైనుంచి వస్తున్న ప్రవాహానికి కొట్టుకుపోయారు. గలంతైన వారు స్థానిక ILM డిపో ప్రాంతానికి చెందిన కోటయ్య (20), విశాల్ (21) గా గుర్తించారు. విశాల్ మృతదేహం లభ్యం కాగా.. కోటయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
News October 5, 2025
విశాఖలో వీధి వ్యాపారులకు స్ట్రీట్ వెండింగ్ జోన్లు

‘<<17803065>>ఆపరేషన్ లంగ్స్<<>>’లో దుకాణాలు కోల్పోయిన వీధి వ్యాపారులకు 21 ప్రాంతాల్లో GVMC స్ట్రీట్ వెండింగ్ జోన్లను ఏర్పాటు చేసింది. మొత్తం 649దుకాణాలకు స్థలాలను గుర్తించింది. చిరువ్యాపారులు ఉపాధి కోల్పోకుండా ఉండేందుకు వీలుగా ఈజోన్లు ఏర్పాటు చేశారు. UCDఆధ్వర్యంలో 8జోన్లలో మొత్తం 18,041 వీధి వ్యాపారులను గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకు UCDకి 6,755 మంది మాత్రమే రూ.200 చెల్లించి గుర్తింపుకార్డు పొందారు.
News October 5, 2025
నల్గొండ: కాలువలో జారిపడి మహిళ మృతి

నల్గొండ మండలం కొత్తపల్లిలోని డీ-37 కాలువలో జారిపడి మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. అదే సమయానికి అటుగా వెళుతున్న గ్రామస్థులు పెరిక రాము, పాలడుగు నాగార్జున ఆమెను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దురదృష్టవశాత్తు ఆమె అప్పటికే మృతి చెందింది. మృతురాలి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.