News March 17, 2025

కామారెడ్డి: భార్యని చంపిన భర్త

image

అనుమానంతో భార్యని చంపాడో భర్త. ఈ ఘటన HYDలోని అంబర్‌పేట్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. కామారెడ్డి (D) దోమకొండ (M) అంబర్‌పేటకు చెందిన నవీన్‌కు బీబీపేట్(M)కు చెందిన రేఖ(27)తో పెళ్లైంది. వీరు HYDలో అంబర్‌పేట్‌లో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన నవీన్‌ భార్య ప్రవర్తనపై అనుమానంతో ఈనెల 10న పెట్రోల్ పోసి నిప్పంటించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. రేఖ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News November 13, 2025

విశాఖ సదస్సుతో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎంవో

image

AP: విశాఖలో జరగనున్న CII భాగస్వామ్య సదస్సుకు రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోందని CMO తెలిపింది. ఈ సమావేశంలో ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయని వెల్లడించింది. ‘ఇన్వెస్ట్ ఇన్ ఏపీ’ సందేశాన్ని సమ్మిట్ ద్వారా చాటి చెప్పాలని సీఎం చంద్రబాబు సంకల్పించినట్లు పేర్కొంది. కాగా ఈ సదస్సులో సీఎం వైజాగ్‌కు చేరుకోగా ఆయనకు హోంమంత్రి అనిత, పలువురు మంత్రులు స్వాగతం పలికారు.

News November 13, 2025

మహానంది కోనేరు వద్ద భద్రత కరవు?

image

మహానంది దేవస్థానంలోని కోనేరుల వద్ద భక్తులకు భద్రత కరవైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ వేలాది మంది పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. గతంలో చోరీల నివారణకు షిఫ్టుల వారీగా 8 మంది హోంగార్డులు విధులు నిర్వర్తించేవారు. అయితే, ప్రస్తుతం వేతనాల భారం పేరుతో వారి సంఖ్యను ఒక్కరికి తగ్గించడంతో భద్రత ప్రశ్నార్థకమైందని భక్తులు అంటున్నారు.

News November 13, 2025

దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి: GWMC కమిషనర్

image

పీఎం స్వానిధి పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న 5,600 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ బ్యాంకర్లను ఆదేశించారు. బల్దియా పరిధిలో రూ.15,000 నుంచి రూ.50,000 వరకు రుణాల కోసం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని డిసెంబర్ 2లోగా పూర్తి చేయాలని మెప్మా అధికారులతో జరిగిన సమావేశంలో సూచించారు.