News February 24, 2025
కామారెడ్డి: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.
Similar News
News February 24, 2025
మద్దూరు: అదృశ్యమై.. శవమై కనిపించాడు

మద్దూరు మండలంలో ఓ గుర్తు <<15554760>>తెలియని <<>>వ్యక్తి ఉరేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. ఎస్ఐ విజయ్‌కుమార్ వివరాలు.. రెనివట్ట గ్రామానికి చెందిన రాములు(50) గత నెల 20న ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో ఆయన భార్య 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఆదివారం ఆయన చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాములుగా గుర్తించారు.
News February 24, 2025
వేసవి ప్రారంభంలోనే మండుతున్న సూర్యుడు

నల్గొండ జిల్లాలో వేసవి ప్రారంభంలోనే ఎండలు తీవ్రమయ్యాయి. శీతాకాలం ముగియకముందే 20 రోజులుగా ఉష్ణోగ్రతల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జనవరి చివరి వరకు రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో తీవ్రమైన చలి కనిపించింది. వేసవి ప్రారంభం కావడంతో ముదురుతున్న ఎండలకు జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఆదివారం జిల్లాలో పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు నమోదు అయ్యాయి.
News February 24, 2025
అసెంబ్లీకి చేరుకున్న చంద్రబాబు, జగన్

AP: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సభకు హాజరయ్యారు. కాసేపట్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. చాలా రోజుల తర్వాత జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతుండటంతో ఆసక్తి నెలకొంది.