News October 23, 2025

కామారెడ్డి: మద్యం దుకాణాల కోసం నేడు తుది గడువు.!

image

కామారెడ్డి జిల్లాలోని 49 మద్యం దుకాణాల కోసం బుధవారం (నిన్న) వరకు 1,449 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు Way2Newsకు తెలిపారు. నేటికి చివరి రోజు కావడంతో దరఖాస్తుల సంఖ్య ఈరోజు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలోని అత్యధికంగా కామారెడ్డి స్టేషన్ పరిధిలోని 15 షాపులకు 450 దరఖాస్తులు వచ్చాయన్నారు.

Similar News

News October 23, 2025

విజయవాడ రైల్వే డివిజన్‌కు డబ్బే.. డబ్బు!

image

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో SEP 21వ తేదీ నుంచి OCT 21 వరకు దసరా, దీపావళి, ఛత్ పూజ పండుగల నేపథ్యంలో మొత్తం 263 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా తెలిపారు. సుమారు నెల రోజులకు గాను రూ.563 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందన్నారు. గతంతో పోల్చుకుంటే ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పారు. VJA, రాజమండ్రి, నెల్లూరు, గూడూరు వంటి ప్రధాన స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లను నడిపామన్నారు.

News October 23, 2025

ప్రకాశం: ఇళ్లు కట్టుకునేవారికి GOOD NEWS

image

రాష్ట్ర ప్రభుత్వం ‘ హౌసింగ్ ఫర్ ఆల్ ‘ పథకంలో భాగంగా పేదలకు సొంత ఇంటి స్థలం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నందున అర్హులు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ..GO ఎంఎస్ నెంబర్ -23 ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఇంటి స్థలం కేటాయిస్తామని అన్నారు. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News October 23, 2025

పూర్తి బకాయిలు చెల్లించేవరకు ఆందోళనలు: నెట్‌వర్క్ ఆసుపత్రులు

image

AP: ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి రూ.250 కోట్లు <<18076438>>రిలీజ్<<>> చేసినా నెట్‌వర్క్ ఆసుపత్రులు వెనక్కి తగ్గలేదు. తాము డిమాండ్ చేస్తున్న రూ.2,700 కోట్ల పూర్తి బకాయిలను చెల్లించాలని ఆసుపత్రుల అసోసియేషన్ కోరింది. పూర్తి బకాయిలు చెల్లించేవరకు ఆందోళన కొనసాగుతుందని ప్రకటించింది. ప్రభుత్వం విడుదల చేసిన వాటితో సరిపెట్టుకోలేమని స్పష్టం చేసింది. దీంతో ఇవాళ ‘చలో విజయవాడ మహాధర్నా’ యథాతథంగా ఉంటుందని పేర్కొంది.