News December 25, 2025
కామారెడ్డి: మరో మూడు రోజులు శీతలమే

కామారెడ్డి జిల్లాలో మరో మూడు రోజుల పాటు చలి ప్రభావం ఎక్కువవుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. 8°C నుంచి 9.5°C అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని, ఆరంజ్ అలర్ట్‌లో జిల్లా ఉండబోతుందని వెల్లడించింది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. చల్లని వాతావరణంలో బయటకు రావడం తగ్గించాలన్నారు.
Similar News
News December 25, 2025
WPL: రేపు సాయంత్రం 6 గంటలకు టికెట్లు విడుదల

ఉమెన్ ప్రీమియర్ లీగ్(WPL)-2026 మ్యాచ్‌ల టికెట్లు రేపు సా.6 గంటలనుంచి అందుబాటులోకి రానున్నాయి. జనవరి 9న లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. నవీ ముంబై, వడోదరా వేదికల్లో ఈ సీజన్ మ్యాచులు జరగనున్నాయి. మొత్తం 5 జట్లు పాల్గొననుండగా ఎలిమినేటర్, ఫైనల్‌తో కలుపుకొని 22 మ్యాచులు ఉన్నాయి. ఫిబ్రవరి 5న ఫైనల్ జరగనుంది. వెబ్‌సైట్: https://www.wplt20.com/.
News December 25, 2025
నల్గొండ: కొత్త బిల్లుతో పేదల పొట్ట కొట్టే కుట్ర: బి.వెంకట్

గ్రామీణ పేదల కడుపు నింపే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మండిపడ్డారు. గురువారం నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ‘ఉపాధి బిల్లు-2025’ పేదల పాలిట శాపంగా మారబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
News December 25, 2025
పిన్నెల్లి సోదరులకు జనవరి 7 వరకు రిమాండ్

గుండ్లపాడు జంట హత్య కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులకు జనవరి 7 వరకు రిమాండ్ పొడిగించారు. నెల్లూరు జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి లను మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి వర్చువల్‌గా విచారించి రిమాండ్‌ను పొడిగించారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ6గా, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఏ7గా ఉన్నారు.


