News June 23, 2024

కామారెడ్డి: మామతో కలిసి భర్తను చంపిన భార్య

image

బాన్సువాడ మండలంలో దారుణం జరిగింది. మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో జులాయిగా తిరుగుతూ తాగి వచ్చి కొడుతూ ఇబ్బందులు పెడుతున్న రాములు (33)ను అతడి భార్య మంజుల తన మామ నారాయణతో కలిసి హత్య చేసింది. మృతదేహాన్ని ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్‌లో 2 రోజులు ఉంచి తదుపరి ఇంటి ఆవరణలోనే గుంత తీసి పాతిపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం మృతదేహాన్ని వెలికి తీసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News September 14, 2025

జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ

image

జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ జరిగిందని NZB CP సాయి చైతన్య జాతీయ మెగా లోక అదాలత్ లో భాగంగా వివిధ కేసులలో రాజీ పడి పరిష్కారం అయినందునకు నిజామాబాద్ జిల్లాకు 4వ స్థానం దక్కిందని, సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ.42,45,273-00ను సైతం తిరిగి సైబర్ బాధితులకు అందజేసినట్లు వివరించారు. జిల్లాను అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.

త్వరలో నిజామాబాద్ – ముంబై మధ్య వందే భారత్ రైలు: MP

image

త్వరలోనే నిజామాబాద్ – ముంబై మధ్య వందే భారత్ రైలు ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. శనివారం జరిగిన NZB చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వందే భారత్ రైలు మంజూరు కోసం చేసిన వినతి, రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు.