News January 18, 2026
కామారెడ్డి: మున్సిపల్ టికెట్ల రేసులో ‘యువ’ గళం!

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఆసక్తికరంగా మారింది. సీనియారిటీ కంటే యువత, విద్యావంతుల వైపే రాజకీయ పార్టీలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో యువత సత్తా చాటడం, రిజర్వేషన్లతో మహిళల వాటా పెరగడంతో ఈసారి మున్సిపల్ పగ్గాలు కొత్త తరం చేతికి దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
Similar News
News April 15, 2026
యుద్ధం.. 4 పాయింట్లతో చైనా పీస్ ప్లాన్!

ఇరాన్, US మరోసారి చర్చలకు యత్నిస్తున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 4 పాయింట్లతో పీస్ ప్లాన్ సూచించారు. ‘పశ్చిమాసియా, గల్ఫ్‌లో సుస్థిర భద్రతా వ్యవస్థ ఏర్పాటుకు దేశాలు బంధాలు మెరుగుపరుచుకోవాలి. దేశాల జాతీయ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి. ఐక్యరాజ్యసమితి కేంద్రంగా అంతర్జాతీయ వ్యవస్థను దృఢంగా నిలబెట్టాలి. అన్ని దేశాలు అభివృద్ధిని భద్రతతో అనుసంధానించాలి. ఇందుకు మేం సాయపడతాం’ అని పేర్కొన్నారు.
News April 15, 2026
SSS: జిల్లా వ్యాప్తంగా తనిఖీలు.. RMP క్లినిక్‌లకు షోకాజ్ నోటీసులు

శ్రీ సత్యసాయి కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపి క్లినిక్‌లపై తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పెనుకొండ డివిజన్‌లో 2 క్లినిక్‌లు, కదిరి డివిజన్‌లో 2, పుట్టపర్తి డివిజన్‌లో 1 RMP క్లినిక్‌కి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ లు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News April 15, 2026
GK: తొలి కంప్యూటర్ ప్రోగ్రామర్ ఎవరు?

☛ కంప్యూటర్ పితామహుడు-చార్లెస్ బాబేజ్
☛ ఆధునిక కంప్యూటర్ పితామహుడు-అలాన్ ట్యూరింగ్
☛ మొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్-అడా లవ్‌లేస్ (ఫొటోలో)
☛ మొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్-ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ (ENIAC)
☛ కంప్యూటర్ మెదడు అని దేనిని పిలుస్తారు-CPU (సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్)
☛ 1024 MB: 1 GB (గిగాబైట్)
☛ 1024 GB: 1 TB (టెరాబైట్)


