News July 8, 2025
కామారెడ్డి మెడికల్ కళాశాలకు నూతన ప్రిన్సిపల్

కామారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నూతన ప్రిన్సిపల్‌గా వాల్యను నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గాంధీ మెడికల్ కళాశాలలో ఆర్థోపెడిక్స్ విభాగంలో హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ డా.వాల్య ప్రమోషన్ పై జిల్లా మెడికల్ కళాశాలకు పిన్సిపల్‌గా రానున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Similar News
News July 8, 2025
రైల్‌రోకో కేవలం ట్రైలరే: MLC కవిత

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, MLC కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. రైల్ రోకో కేవలం ట్రైలర్ మాత్రమేనని, బిల్లును ఆమోదించకపోతే భవిష్యత్తులో నిరవధికంగా రైల్‌రోకోను నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.
News July 8, 2025
సభ్యత్వం తీసుకునేలా కృషి చేయాలి: కలెక్టర్

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మంగళవారం కామారెడ్డి మండల సమాఖ్య ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తిలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళా సంఘంలో సభ్యత్వం తీసుకునేలా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. బ్యాంకు లింకేజీ లక్ష్యాన్ని 100% పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు.
News July 8, 2025
సిరాజ్‌కు రెస్ట్.. బుమ్రా ఎంట్రీ!

ఇంగ్లండ్‌తో ఎల్లుండి ప్రారంభం కానున్న మూడో టెస్టుకు స్టార్ బౌలర్ సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు, మూడో టెస్టుకు మధ్యలో మూడు రోజులే గ్యాప్ వచ్చింది. దీంతో తొలి టెస్టులో 41 ఓవర్లు, రెండో దాంట్లో 32 ఓవర్లు వేసిన సిరాజ్‌పై వర్క్‌లోడ్ పడొద్దని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే అతని స్థానంలో బుమ్రాను తీసుకోనున్నట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి.