News April 17, 2025
కామారెడ్డి: మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

కామారెడ్డి జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో మే1 నుంచి 31 వరకు వేసవి శిక్షణ శిబిరం ప్రారంభమవుతుందని జిల్లా యువజన క్రీడల అధికారి జగన్నాథం పేర్కొన్నారు. ఈ శిక్షణ శిబిరానికి 14 సంవత్సరాలలోపు ఉన్న బాల బాలికలు జిల్లాలోని 10 మండలాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు ఈ నెల 26లోపు ఇన్‌ఛార్జ్‌లకు సంప్రదించాలన్నారు.
Similar News
News April 19, 2025
JEE టాప్-10 ర్యాంకర్స్ వీరే

JEE ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఇందులో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు తొలి రెండు ర్యాంకుల్లో నిలిచారు. మూడు, నాలుగు ర్యాంకులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన విద్యార్థులు కైవసం చేసుకున్నారు. 1.MD అనాస్, 2.ఆయుష్ సింఘాల్(RJ), 3.అర్చిష్మాన్ నాండీ, 4.దేవదత్త మాఝీ(WB), 5.రవి చౌదరి(MH), 6.లక్ష్య శర్మ(RJ), 7.కుషాగ్ర గుప్తా(KN), 8.హర్ష్ ఏ గుప్తా(TG), 9.ఆదిత్ ప్రకాశ్ భగాడే(GJ), 10.దక్ష్ (DL).
News April 19, 2025
30 ఏళ్లు దాటిన మహిళలకు అలర్ట్!

మహిళల ఆరోగ్యం పాడైతే ఇల్లు అనే బండి సాఫీగా కదలదు. ముఖ్యంగా ఇంటి పనులతో పాటు జాబ్ చేసే ఆడవారికి 30 ఏళ్లు దాటితే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వారంతా గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష(HPV), రొమ్ము క్యాన్సర్ టెస్ట్, బ్లడ్ షుగర్‌తో పాటు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఏదైనా జబ్బు బయటపడితే తొందరగా నయం చేసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
News April 19, 2025
పాన్ ఇండియా లెవల్‌లో దృశ్యం-3

మలయాళం సినిమాలు దృశ్యం, దృశ్యం-2 అన్ని భాషల్లో రీమేక్ అయి మంచి విజయాలు అందుకున్నాయి. దృశ్యం-3 తెరకెక్కించే పనుల్లో డైరెక్టర్ జీతూ జోసెఫ్ బిజీగా ఉండగా, ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దృశ్యం-3ని రీమేక్ చేయకుండా, పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అన్ని భాషల్లో కలుపుకొని రూ.500 కోట్లు వసూలు చేయాలని హీరో మోహన్‌లాల్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.