News February 24, 2026
కామారెడ్డి: మైనార్టీ కమిషన్ ఛైర్మన్‌కు స్వాగతం పలికిన కలెక్టర్

కామారెడ్డి జిల్లా కేంద్రానికి రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారిక్ అన్సారీ మంగళవారం వచ్చారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి జయరాజ్, ఆర్ఎల్సీ బషీర్, విజిలెన్స్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News February 25, 2026
జమ్మికుంట: రెండు రోజులుగా నిలకడగానే పత్తి ధర

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీలో బుధవారం పత్తి ధరలు నిన్నటి లాగా నిలకడగానే కొనసాగాయి. మార్కెట్‌కు పత్తి రాక సాధారణంగా ఉన్నప్పటికీ రెండు రోజులుగా ధరల్లో పెద్దగా మార్పు లేకపోవడం గమనార్హం. మొత్తం 24 వాహనాల ద్వారా 205 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ.7,550, కనిష్టంగా 7,000 ధర పలికింది. పత్తిలో తేమ శాతం తక్కువగా ఉండి, నాణ్యత బాగున్న పంటకు గరిష్ట ధర లభిస్తోందని అధికారులు సూచిస్తున్నారు.
News February 25, 2026
SRCL: ‘డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి’

జిల్లాలో డ్రగ్స్, మాదక ద్రవ్యాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని కలెక్టరేట్‌లో నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స అందించాలన్నారు.
News February 25, 2026
MNCL: ఇంటర్ పరీక్ష కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మంచిర్యాల, వేంపల్లిలోని పరీక్షా కేంద్రాలను సందర్శించి ఇంటర్మీడియట్ పరీక్షలను పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.


