News November 20, 2024

కామారెడ్డి: రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి : కలెక్టర్ సంగ్వాన్

image

రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా నేడు జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తోందన్నారు. మహిళాశక్తి కార్యక్రమం కింద క్యాంటీన్ల ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News January 1, 2026

NZB: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 130 మంది పట్టివేత

image

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లావ్యాప్తంగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 130 మంది వాహనదారులు పట్టుబడ్డారని జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ విభాగం పరిధిలో డిసెంబర్ 31 రాత్రి పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ చర్యలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు.

News January 1, 2026

NZB: న్యూ ఇయర్.. న్యూ కలెక్టర్ ముందున్న సవాళ్లు

image

నిజామాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి బుధవారం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కొత్త సంవత్సరం ముందు కొత్త కలెక్టర్ ముందు ఉన్న సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ముఖ్యంగా మున్సిపల్, పరిషత్ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలి. అధికారులతో సమన్వయం చేసుకోవాలి. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలయ్యేలా చూడాలి. అయితే ఆమె నల్గొండ జిల్లాలో సమర్థవంతంగా పని చేశారు.

News January 1, 2026

NZB: న్యూ ఇయర్ కేక్ కోసిన సీపీ

image

నిజామాబాద్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అర్ధరాత్రి నూతన సంవత్సర స్వాగత సంబరాలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కేకు కోసి నగర పోలీస్ అధికారులకు తినిపించారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బస్వా రెడ్డి, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.