News November 8, 2025
కామారెడ్డి: రాష్ట్ర పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పురస్కారాల ప్రధానం కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు. KMR జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల శుక్రవారం తెలిపారు. దివ్యాంగుల సాధికారత కోసం విశిష్ట సేవలందిస్తున్న వ్యక్తులు, సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతులను ఈనెల 12 వరకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, రూం నంబర్ 31, కలెక్టరేట్‌లో సమర్పించాలని కోరారు.
Similar News
News November 8, 2025
అనకాపల్లి: ఈనెల 10 నుంచి జిల్లా స్థాయి యువజనోత్సవాలు

జిల్లాస్థాయి యువజనోత్సవాలను ఈనెల 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం గోడపత్రికను ఆవిష్కరించారు. అనకాపల్లిలో 10వ తేదీన 15-29 ఏళ్లలోపు యువ కళాకారులకు 7 విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్రస్థాయికి ఎంపిక అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో సెట్విస్ సీఈవో కవిత పాల్గొన్నారు.
News November 8, 2025
ప్రీటెర్మ్ బర్త్‌కు ఇదే కారణం

గర్భధారణ తర్వాత తొమ్మిది నెలలు నిండాక బిడ్డకు జన్మనివ్వడం సాధారణం. కానీ మరికొందరిలో నెలలు నిండక ముందే ప్రసవం జరుగుతుంది. దీన్నే ప్రీటెర్మ్ బర్త్ అని కూడా అంటారు. ఇలా నెలల నిండకుండానే డెలివరీ కాకపోవడానికి పోషకాహార లోపం, రక్తహీనత, మానసిక సమస్యలే ముఖ్య కారణమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇలా ఎక్కువగా స్ట్రెస్ కాకుండా ప్రశాంతంగా ఉంటూ పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
News November 8, 2025
ఈరోజు మీకు సెలవు ఉందా?

AP: మొంథా తుఫాను సమయంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి రెండో శనివారం పాఠశాలలు నిర్వహించాలని DEOలు ఆదేశాలు ఇచ్చారు. దీంతో నేడు విశాఖ, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో స్కూళ్లకు సెలవు రద్దు చేశారు. కర్నూలు, నంద్యాల, NTR, కడప, ప.గో, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లోనూ పాఠశాలలకు సెలవు రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరి మీ ప్రాంతంలో స్కూల్ ఉందా? COMMENT


