News April 6, 2025

కామారెడ్డి: రేపు కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్లు ప్రారంభం

image

కామారెడ్డి జిల్లాలో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్లను సోమవారం ప్రారంభించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 18 కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, వాటిని ఫార్చునర్ ద్వారా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజన్ పౌల్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జిల్లా పోలీస్ శాఖ ద్వారా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Similar News

News September 15, 2025

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ఏలూరు JC

image

ప్రభుత్వం మరోసారి IAS, IPS అధికారుల బదిలీ చేపట్టింది. కొన్ని రోజులుగా IAS, IPS అధికారుల బదిలీ ప్రక్రియ చేపడుతున్న ప్రభుత్వం సోమవారం పలువురు IAS, IPS అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌ ధాత్రి రెడ్డిని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ప్రభుత్వం నియమించింది.

News September 15, 2025

ANU: పరీక్షా ఫలితాలు విడుదల

image

ANU పరిధిలో నిర్వహించిన PG సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. జులైలో నిర్వహించిన M.SC స్టాటిస్టిక్స్, M.SC బయోకెమిస్ట్రీ పరీక్షల ఫలితాలను విడుదల చేశామని పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు తెలిపారు. రీవాల్యుయేషన్‌కు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఒక్కో పరీక్షకు రూ.1,860ల చొప్పున ఈ నెల 24లోపు చెల్లించాలన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

News September 15, 2025

MBBS అడ్మిషన్స్.. మెరిట్ లిస్ట్ రిలీజ్

image

TG: MBBS కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ విడుదల చేసింది. ఇక్కడ <>క్లిక్<<>> చేసి ఫలితాలు చేసుకోండి. రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 18న రాత్రి 11.30 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. యూనివర్సిటీ ఫీజు రూ.12,000 తప్పనిసరిగా చెల్లించాలని పేర్కొంది.