News September 14, 2025
కామారెడ్డి: రేపు విద్యుత్ ప్రజావాణి

కామారెడ్డి జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రావణ్ కుమార్ తెలిపారు. సబ్‌డివిజన్, సెక్షన్, సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, జిల్లా కార్యాలయంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వినతులను స్వీకరిస్తారని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 14, 2025
మచీలీపట్నం ఎంపీకి మూడవ ర్యాంక్

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో మచీలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి మూడవ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 72 ప్రశ్నలు అడగటంతో పాటు 18 చర్చల్లో పాల్గొన్నారు. ఆయన హాజరు శాతం 79.41%గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.
News September 14, 2025
అందుకే.. సాయంత్రం ఈ పనులు చేయొద్దంటారు!

సూర్యాస్తమయం తర్వాత వచ్చే సుమారు 45 నిమిషాల కాలాన్ని అసుర సంధ్య వేళ, గోధూళి వేళ అని అంటారు. ఈ సమయంలో శివుడు, పార్వతీ సమేతంగా తాండవం చేస్తాడని నమ్ముతారు. శివతాండవ వీక్షణానందంతో అసుర శక్తులు విజృంభించి జనులను బాధిస్తాయి. ఈ వేళలో ఆకలి, నిద్ర, బద్ధకం వంటి కోరికలు కలుగుతాయి. వీటికి లోనైతే ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అందుకే ఈ వేళలో నిద్రపోవడం, తినడం, సంభోగం వంటి పనులు చేయొద్దని పెద్దలు చెబుతుంటారు.
News September 14, 2025
పెద్దపల్లి: దారుణం.. పట్టపగలే వివాహిత హత్య..!

పెద్దపల్లి(D) రామగిరి మం.లోని పన్నూరులో పట్టపగలే దారుణం జరిగింది. వకీల్‌పల్లె ఫ్లాట్స్‌లోని CCరోడ్డులో వివాహిత పూసల రమాదేవి హత్యకు గురైంది. MNCLవాసి రమాదేవి ఏడాది నుంచి భర్త కృపాకర్‌కు దూరంగా ఉంటోంది. ఇటీవల అత్తింటికి రాగా వారితో గొడవ పడింది. ఈ క్రమంలో అత్తింటి ముందే విగతజీవిగా కనిపించింది. అయితే కుటుంబ కలహాలతోనే ఆమెను భర్త, అత్తమామ హత్య చేశారా లేదా అనేది తెలియాల్సి ఉంది. వీరంతా పరారీలో ఉన్నారు.