News October 16, 2025
కామారెడ్డి: రైల్వే ట్రాక్‌పై మహిళ మృతదేహం

కామారెడ్డి పట్టణ శివారులోని రైల్వే ట్రాక్‌పై గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది, ఉదయం రైల్వే ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళుతున్న కొందరు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Similar News
News October 16, 2025
మునగాల తహశీల్దార్ కార్యాలయం తనిఖీ.. ఉద్యోగుల సస్పెండ్

కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ మునగాల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో సగానికి సగం సిబ్బంది విధులకు గైర్హాజరు కావడాన్ని గుర్తించారు. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు విధుల్లో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.
News October 16, 2025
గుంటూరులో సినీనటులపై NSUI ఫిర్యాదు !

తెలుగు సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్, హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ పై NSUI గుంటూరు బృందం లాలాపేట స్టేషన్లో ఫిర్యాదు చేసింది. NSUI జిల్లా అధ్యక్షుడు కరీమ్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ పై వారు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశామని అన్నారు.
News October 16, 2025
ట్రంప్ ‘ఆయిల్’ కామెంట్స్‌పై భారత్ స్పందన

రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయబోమంటూ మోదీ హామీ ఇచ్చారన్న ట్రంప్ <<18018198>>వ్యాఖ్యలపై<<>> భారత్ స్పందించింది. తాము ఆయిల్, గ్యాస్ ప్రధాన దిగుమతిదారని, దేశంలోని వినియోగదారుల ప్రయోజనాలను బట్టే కొనుగోలు చేస్తామని MEA అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. దీని ఆధారంగానే తమ ఇంధన దిగుమతి విధానాలు రూపొందించామన్నారు. అటు ఇంధన సేకరణ పెంచుకోవడానికి అమెరికాతోనూ చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు.