News January 11, 2026

కామారెడ్డి: రోడ్డు నిబంధనలు పాటించాలి

image

వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు వాహన డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. రోడ్డు నిబంధనలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు పలు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.

Similar News

News February 22, 2026

నాగర్ కర్నూల్ జిల్లా.. ఇంటర్ పరీక్షలకు వేళాయె!

image

నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ తెలిపారు.
✒ఇంటర్మీడియట్ విద్యార్థుల సంఖ్య: 15,173
✒ మొత్తం పరీక్ష కేంద్రాలు: 34
✒ఇన్విజిలేటర్లు: 300
✒అన్ని కేంద్రాల్లో CC కెమెరాల నిఘా
✒హాల్ టికెట్లలో QR కోడ్ స్కాన్ చేస్తే ఎగ్జామ్ సెంటర్ వివరాలు వస్తాయి
✒సిట్టింగ్ స్క్వాడ్లు: 3
✒చీఫ్ సూపరింటెండెంట్స్- 34
✒కస్టోడియన్స్- 6
✒మెడికల్ ANMలు- 34

News February 22, 2026

పెద్దవాళ్ల సబ్బునే పిల్లలకూ వాడుతున్నారా?

image

చిన్నపిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకే వారికి ఉపయోగించే ఉత్పత్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. చాలామంది పిల్లలకు తర్వాత పెద్దవాళ్ల సబ్బులే వాడుతుంటారు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల వారికి చిరాకు, అలర్జీ వచ్చే అవకాశముందంటున్నారు. పిల్లల ఉత్పత్తుల్లో పారబెన్స్‌, మినరల్‌ ఆయిల్స్‌, సల్ఫేట్స్‌ లేకుండా pH5.5% ఉండేలా చూసుకోవాలంటున్నారు.

News February 22, 2026

NIT దుర్గాపూర్‌లో ఉద్యోగాలు

image

NIT దుర్గాపూర్ 3 ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్(2), రీసెర్చ్ అసిస్టెంట్(1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 7 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ(సోషల్ సైన్స్), NET/M.Phil/PhD అర్హత ఉండాలి. రీసెర్చ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.37,000, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20,000 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitdgp.ac.in