News January 11, 2026
కామారెడ్డి: రోడ్డు నిబంధనలు పాటించాలి

వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు వాహన డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. రోడ్డు నిబంధనలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు పలు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.
Similar News
News February 18, 2026
నెల్లుట్లలో విపత్తు నిర్వహణ విన్యాసాలు

నెల్లుట్ల చెరువు వద్ద ఎన్డీఆర్‌ఎఫ్ నిపుణులు బుధవారం నిర్వహించిన విపత్తు సన్నద్ధత విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్, డీసీపీ, ఆర్డీఓ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. వరదలు, ప్రమాదాల సమయంలో ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో బృందం సభ్యులు ప్రత్యక్షంగా చేసి చూపారు. సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పర్యవేక్షించగా, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
News February 18, 2026
పదో తరగతి ఉత్తీర్ణత సాధించేలా చర్యలు: కలెక్టర్

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి పదో తరగతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెంపు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పెంపు, పాఠశాలల్లో తాగునీటి, మరుగుదొడ్ల సౌకర్యాల మెరుగుదల తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
News February 18, 2026
విశాఖ: ‘సముద్ర సంప్రదాయాల పట్ల ఐక్యతకు నిదర్శనం ఫ్లీట్ రివ్యూ’

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించారు. ఈ కార్యక్రమం సముద్ర సంప్రదాయాల పట్ల దేశాల మధ్య ఉన్న ఐక్యత, గౌరవానికి చిహ్నమని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ దేశాల నౌకాదళాల సమిష్టి కృషి వల్ల సముద్ర మార్గాలు ప్రపంచాభివృద్ధికి, శ్రేయస్సుకు, మానవాళి సంక్షేమానికి కీలకమైన ద్వారాలుగా మారుతాయని రాష్ట్రపతి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.


