News May 7, 2024
కామారెడ్డి: రోడ్డు పక్కన పకోడి తిన్న కేసీఆర్
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కామారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డికి వస్తున్న కేసీఆర్ ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఓ టీ స్టాల్‌లో టీ తాగి పకోడి తిన్నారు.
Similar News
News January 18, 2025
నిజామాబాద్: ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు రాక
మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం నిజామాబాద్ రానున్నారు. ఉదయం 10 గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్‌కు చేరుకునే ఆయన అక్కడ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30కు పోలీస్ కమిషనరేట్‌లో భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. తదుపరి గోల్ హనుమాన్ వద్ద మున్సిపల్ జోన్ కార్యాలయాన్ని ప్రారంభించి రూ.380 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారు.
News January 17, 2025
నిర్మలా సీతారామన్‌ను కలిసిన ఎంపీ అరవింద్
కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌ను నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిర్మల సీతారామన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇటీవలి పరిణామాలను వివరించాను. అదేవిధంగా కొత్తగా ప్రారంభించబడిన జాతీయ పసుపు బోర్డు పట్ల రాష్ట్రంలో జరుగుతున్న ఆనందోత్సాహాలు వారికి వివరించారు.
News January 17, 2025
NZB: గాలిపటం కోసం యత్నించిన బాలుడికి షాక్
విద్యుత్ వైర్లపై ఉన్న గాలిపటాన్ని తీసేందుకు యత్నించిన బాలుడు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. నిజామాబాద్ వినాయక్ నగర్‌లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కాలనీకి చెందిన షేక్ జిశాంత్ బంగ్లాపై ఆడుకుంటూ ఉండగా విద్యుత్ వైర్లకు గాలిపటం ఉండటంతో దాన్ని తీసే క్రమంలో సర్వీస్ వైర్లు తగిలి షాక్‌కు గురయ్యాడు. 50% కాలిన గాయలతో బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ దర్యాప్తు చేపట్టారు.